SNP
Preity Zinta, Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వదిలేసి.. వేలంలోకి వస్తే.. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే అతన్ని పంజాబ్‌లోకి తీసుకొస్తాం అని ఇటీవల ప్రీతి జింటా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా ప్రీతి స్పందించింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Preity Zinta, Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వదిలేసి.. వేలంలోకి వస్తే.. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే అతన్ని పంజాబ్‌లోకి తీసుకొస్తాం అని ఇటీవల ప్రీతి జింటా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా ప్రీతి స్పందించింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆ జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే.. గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, అతని స్థానంలో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దీంతో.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్‌ను వీడి, వేరే టీమ్‌కు ఆడతాడనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కనుక వేలంలో పాల్గొంటే.. ఎంత ఖర్చు పెట్టి అయినా అతన్ని తమ టీమ్‌లోకి తీసుకుంటామని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా చెప్పినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి.
అయితే.. తాను అలా చెప్పలేదంటూ తాజాగా ప్రీతి జింటా వివరణ ఇచ్చారు. రోహిత్ శర్మ గురించి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. రోహిత్ శర్మను పంజాబ్ కింగ్స్ టీమ్‌లోకి తీసుకుంటాం అని వస్తున్న వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అతనికి నేను అభిమానిని కూడా. అంతేకానీ ఏ ఇంటర్వ్యూలో అతని గురించి నేను మాట్లాడలేదు, అసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదని పేర్కొంది. అయినా ప్రస్తుత పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, ప్రస్తుతం అతను గాయపడ్డాడు. ఇలాంటి స్థితిలో ఈ కథనాలు చాలా దారుణంగా ఉన్నాయని ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ… ‘ఎలాంటి క్లారిటీ లేకుండా, ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ ఎలా చక్కర్లు కొడుతుందని చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి తమను ఇబ్బంది పెట్టకూడదని మీడియాను కోరుతున్నాను. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే.. ప్రస్తుతం మా వద్ద మంచి టీమ్ ఉంది. ఇప్పుడు మా దృష్టి మొత్తం మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంది.’ అని ఆమె పేర్కొన్నారు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసుకుంటారని వార్తలు రావడంతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న శిఖర్ ధావన్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అందుకే.. ప్రీతి జింటా ఇప్పుడు ఇంత హడావుడిగా ఈ ప్రకటన చేశారని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Fakenews ! All these articles are completely fake & baseless. I hold Rohit Sharma in very high regard & am a big fan of his, but I have NEVER DISCUSSED him in any interview nor made this STATEMENT ! I also have a lot of respect for Shikhar Dhawan & he being currently injured ,… pic.twitter.com/VYbyV4eqHU
— Preity G Zinta (@realpreityzinta) April 19, 2024