iDreamPost

వర్షా కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షా కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. మరీ ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రధానంగా వానా కాలంలో కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకు వానా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షా కాలంలో ముఖ్యంగా జలుబు, ఫ్లూ, డెంగ్యూతో పాటు మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షా కాలంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి:

  • వర్షా కాలంలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
  • ఇదే కాకుండా పోషక విలువలున్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలి.
  • చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీళ్లు ఎక్కువగా తాగాలి.
  • చాలా వరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
  • మలేరియా, ఫంగస్, సీజనల్ వ్యాధులు రాకుండా ఇంటి ఆవరణలో అపరిశుభ్రమైన నీళ్లు లేకుండా చూసుకోవాలి.
  • వర్షా కాలంలో పచ్చి కూరగాయాలు, ఆకు కూరలు తినడం తగ్గించాలి.
  • చల్లటి ఆహార పదార్థాలు కాకుండా ఎప్పటికప్పడు వేడి వేడి ఆహారం తినాలి.
  • ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
  • వానా కాలంలో ఎలర్జీ రాకుండా యాంటీ అలర్జిక్ మందులు వాడాలి.
  • NoTE:ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలు కోసం దగ్గరలోని వైద్యుడిని సంప్రదించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి