iDreamPost

వర్షాకాలంలో ఎక్కువగా వినిపించే ఈ పదాలకు అర్థం తెలుసుకోండి!

వర్షాకాలంలో ఎక్కువగా వినిపించే ఈ పదాలకు అర్థం తెలుసుకోండి!

వర్షాకాలంలో, లేదా భారీగా వరదలు వచ్చిన సమయంలో మనం సాధారణంగా వినే పదాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వినిపించేవి టీఎంసీ, క్యూసెక్కు.. అనే పదాలు. మరి ఎప్పూడూ వినే పదాల అర్థం మీకు తెలుసా??

క్యూసెక్కు.. దీని అర్థం ఒక సెకనులో ప్రవహించే ఘనపు అడుగుల నీరు. సింపుల్ గా చెప్పాలంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇలా వచ్చే నీరు 28 లీటర్లు ఉంటుంది.

అలాగే ఒక ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటి పరిమాణాన్ని తెలిపేందుకు టీఎంసీ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. టీఎంసీ అంటే థౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్.. అనగా, వందకోట్ల ఘనపుటడుగులు అని అర్థం.

2,80,00,000 క్యూబిక్ మీట‌ర్లు అయితే ఒక టీఎంసీ. మన రిజర్వాయర్ల నుంచి 24 గంటల పాటు 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంట‌ల పాటు ప్ర‌వ‌హిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్ళినట్లుగా లెక్క వేస్తారు.

మనం ఎన్నోసార్లు ఈ మాటలు వింటూ, అంటూ ఉంటాం. అప్పుడప్పుడూ ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం కూడా ముఖ్యమే మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి