iDreamPost

Pre Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి?ఎలాంటి అర్హతలుండాలి? ఇవి గుర్తుపెట్టుకోకపోతే ఇక గోవిందా!

Pre Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి?ఎలాంటి అర్హతలుండాలి? ఇవి గుర్తుపెట్టుకోకపోతే ఇక గోవిందా!

ఎన్నో డాక్యుమెంట్లు అందిస్తే తప్ప బ్యాంకు వాళ్ళు సాధారణంగా రుణాలు మంజూరు చేయరు. అలాంటి బ్యాంకులు ఏకంగా ప్రీ అప్రూవ్డ్ లోన్లు అందాలంటే ఏం చేయాలి? మీరు కూడా అలా ముందుగా ఆమోదించే రుణాల గురించి చూస్తున్నారా? అయితే ఈ సమాచారాన్ని తెలుసుకోండి.

ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ని ఎవరు తొందరగా పొందుతారు??

అధిక క్రెడిబిలిటీ ఉన్న బ్యాంకు ఖాతాదారులు లేదా రుణగ్రహీతలు ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధిక క్రెడిట్ స్కోర్, జీరో లోన్ డిఫాల్ట్ హిస్టరీ, ఐటిఆర్ ప్రకారం అధిక ఆదాయం, లేదా బ్యాంకుతో పెద్ద బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వ్యక్తులకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఎక్కువగా అందించబడుతుంది. అలాంటి వారినే బ్యాంకులు సైతం వివిధ రకాల ఆఫర్లతో సంప్రదిస్తాయనే విషయాన్ని మీరు గ్రహించాలి.

మీరు రుణం తీసుకున్న తరువాత ఆ మొత్తాన్ని చెల్లించే సామర్థ్యం మీకు ఉందా, లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి బ్యాంకులు. అందుకే వాటికోసం ప్రత్యేకమైన నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసుకుంటాయి. బ్యాంకులు సాధారణంగా  తమకు ఇప్పటికే లభ్యం అవుతున్న సమాచారం ఆధారంగా ప్రీ అప్రూవ్డ్ రుణాన్ని అందిస్తాయి. అయితే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ని ఆమోదించడం మంచిది. ఒకవేళ ఆమోదించాల్సి వస్తే దాని తాలూకు వడ్డీ రేటు, కాలపరిమితి, ఛార్జీలు.. ఇలా అన్ని అంశాల్ని కచ్చితంగా పరిశీలించాలి.

మొత్తంగా మీరు ధృవీకరించిన బ్యాంకుల నుంచి మాత్రమే రుణాన్ని పొందండి. నకిలీ వ్యక్తులు అందించే ఆఫర్లను, వివిధ రూపాల్లో వచ్చే సందేశాల ద్వారా ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకండి. సైబర్ నేరాలు పేట్రేగిపోతున్న తరుణంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోకండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి