sai
sai
యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ సలార్-సీజ్ ఫైర్.. ఈ సారి క్రిస్ మస్ బరిలో దిగబోతోంది. కేజీఎఫ్ సిరీస్‌తో స్టార్ డైరెక్టర్ హోదా సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని ప్రెస్టిజియస్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగితే.. ఈ సెప్టెంబర్ 28నే థియేటర్లలో సందడి చేసేది. ఊహించని విధంగా ఈ సినిమాను పోస్టు పోన్ చేసింది నిర్మాణ సంస్థ హోంబలే. త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని చెప్పింది. ఇటీవల ప్రశాంత్ నీల్ భార్య.. ఈ డిసెంబర్ నిరుడు లెక్క ఉండదు అంటూ ఓ ఆసక్తికర పోస్టు చేశారు. దీంతో సలార్ డిసెంబర్‌లో విడుదల అవుతుందని భావించారు ఫ్యాన్స్. అంతలోనే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ నెల 22న రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక్కడే వార్ ప్రారంభమైంది.. కారణం
ఇదే డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రాబోతోంది షారూఖ్ ఖాన్ మూవీ ’డుంకి‘. ఈ చిత్రాన్ని ఓటమి ఎరుగని, ఫేవరేట్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్ల రూపాయల చొప్పున కొల్లగొట్టిన షారూఖ్.. డుంకితో హ్యాట్రిక్ హిట్ కొట్టి.. మరో వెయ్యి కోట్లను కొల్లగొట్టి.. రికార్డును సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అదే సమయంలో సలార్ కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సలార్ చిత్ర యూనిట్. ఈ ప్రకటనతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వార్ ఖాయమని భావిస్తున్నారు. కేజీఎఫ్1,2 పాన్ ఇండియా మూవీస్‌తో హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్.. సలార్‌తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. టఫ్ కాంపిటీషన్ ప్రశాంత్ నీల్‌కు కొత్తేమీ కాదు. గత సినిమాల విడుదలను చూస్తే అది నిజమనిపించకమానదు. బడా హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు.
టాప్ హీరోలనే టార్గెట్ చేస్తూ ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీలు ఉండటం గమనార్హం. ప్రశాంత్ నీల్.. షారూఖ్‌ను ఢీ కొనడం ఇది తొలిసారి కాదు. తన తొలి పాన్ ఇండియా మూవీతో కొండను ఢీ కొన్న చరిత్ర అతడిది. 2018 డిసెంబర్ 21న షారూఖ్ జీరో సినిమా విడుదల చేసిన రోజే.. యష్ హీరోగా తెరకెక్కించిన కేజీఎఫ్-1ను విడుదల చేసి హిట్ కొట్టాడు. అలాగే కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాడు. 2022 ఏప్రిల్ 13న యంగ్ టాలెంట్ నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ విడుదల కాగా.. కేజీఎఫ్ 2 మరుసటి రోజు అనగా.. ఏప్రిల్14న వరల్డ్ వైడ్‍గా రిలీజయ్యింది. సుమారు 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్‌తో మరోసారి షారూఖ్ ఖాన్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమౌతున్నాడు ప్రశాంత్ నీల్. చూడాలి ఈ సారి బాక్సాఫీస్ బరిలో గెలిచేది ఎవరో.
#PrashanthNeel clash history
2018
Shah Rukh Khan’s #Zero[L] vs #Yash‘s #KGF[W]2022
Joseph Vijay’s #Beast[L] vs Yash’s #KGFChapter2[W]2023 #ShahRukhKhan‘s #Dunki vs #Prabhas‘ #SalaarCeaseFire.
Whom do you think… pic.twitter.com/S3alaoJVls
— Manobala Vijayabalan (@ManobalaV) September 29, 2023