iDreamPost

భారత్ లో ఓపెన్‌ AI తొలి ఉద్యోగిగా.. అరుదైన ఘనత సాధించిన ప్రజ్ఞామిశ్రా

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. కాగా భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రజ్ఞామిశ్రా అరుదైన ఘనతను సాధించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. కాగా భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రజ్ఞామిశ్రా అరుదైన ఘనతను సాధించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

భారత్ లో ఓపెన్‌ AI తొలి ఉద్యోగిగా.. అరుదైన ఘనత సాధించిన ప్రజ్ఞామిశ్రా

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ టెక్నాలజీతో హ్యూమన్ లైఫ్ స్టైల్లో పెను మార్పులు సంబవించబోతున్నాయి. ఇప్పటికే ఏఐ సాంకేతికతను ఉపయోగించి కొన్ని మీడియా సంస్థలు ఆర్టీఫీషియల్ యాంకర్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏఐతో ప్రముఖుల వాయిస్ ను రీక్రియేట్ చేయడం.. సెలబ్రిటీల ఫొటోలు ఏఐతో రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలున్నాయి. కాగా భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రజ్ఞామిశ్రా నియమించబడింది. దీంతో ఆమె మనదేశంలో నియామకం అయిన తొలి ఎంప్లాయిగా అరుదైన ఘనతను సాధించింది.

ఓపెన్‌ ఏఐలో భారత్ లో ‘గవర్నమెంట్‌ రిలేషన్స్‌’ హెడ్‌గా నియమించబడింది ప్రజ్ఞా మిశ్రా. 39 ఏళ్ల ప్రజ్ఞా మిశ్రా దీనికంటే ముందు ‘ట్రూ కాలర్‌’లో పబ్లిక్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పబ్లిక్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌గా వివిధ శాఖల మంత్రులు, స్టేక్‌ హోల్డర్‌లు, ఇన్వెస్టర్‌లు, మీడియా పార్ట్‌నర్‌లతో కలిసి పనిచేసింది. దీనికి ముందు మెటా ప్లాట్‌ఫామ్‌ ‘ఇంక్‌’లో మూడు ఏళ్లు పనిచేసింది. ప్రజ్ఞా మిశ్రా దిల్లీ యూనివర్శిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

ఆ తర్వాత ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ చేసింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో ‘బార్గెయినింగ్‌ అండ్‌ నెగోషియేషన్స్‌’ సబ్జెక్ట్‌లో డిప్లొమా కంప్లీట్ చేసింది. గతంలో వాట్సాప్ భారత్ లో నియమించిన తొలి ఉద్యోగి కూడా ప్రగ్యా మిశ్రానే. తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా వాట్సాప్ 2018లో చేపట్టిన ప్రచార ఉద్యమానికి ఆమె నేతృత్వం వహించారు. మెడిటేషన్‌ ట్రైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పాడ్‌కాస్ట్‌లో ప్రసంగాలు చేస్తూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి