iDreamPost
android-app
ios-app

రైతులకు శుభవార్త.. ఈ పథకం ద్వారా 5 లక్షలు ఫ్రీగా పొందొచ్చు!

రైతులకు శుభవార్త.. ఈ పథకం ద్వారా 5 లక్షలు ఫ్రీగా పొందొచ్చు!

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకాల ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. రైతులకు ఎన్నో రకాలుగా  ఉపయోగపడే ట్రాక్టర్‌కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ట్రాక్టర్‌ కొనడానికి సగం డబ్బుల్ని కేంద్రం నుంచి ఫ్రీగా పొందొచ్చు. మిగిలిన సగం డబ్బుల్ని లోన్‌ ద్వారా కట్టుకోవచ్చు. ఆ పథకమే.. ప్రధాన మంత్రి ట్రాక్టర్‌ యోజన. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రధాన మంత్రి ట్రాక్టర్‌ యోజన అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న సదుద్దేశంతో పలు రకాల స్కీములను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ప్రధాన మంత్రి ట్రాక్టర్‌ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా తక్కువ ధరకు.. అది కూడా సగం ధరకే రైతులు ట్రాక్టర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు.. స్వరాజ్‌ 963 ఎఫ్‌ ఈ 60 హార్స్‌ పవర్‌ ట్రాక్టర్‌ ధర దాదాపుగా 10 లక్షలు ఉంది. ఈ వాహనం కొనాలని అనుకున్న రైతు ఈ పథకానికి అప్లై చేసుకుంటే.. 10 లక్షల్లో 5 లక్షల్ని ప్రభుత్వమే సబ్సీడీ కింద ఫ్రీగా ఇస్తుంది. మిగిలిన సగం కూడా లోన్‌ ద్వారా వస్తుంది.

ఎవరు అర్హులు?

దేశంలోని ప్రతీ చిన్న, సన్నకారు రైతు అర్హుడే. రైతు వయస్సు 18 సంత్సరాలనుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. కౌలు రైతులు అయితే, యజమాని నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే రైతు ఆదాయం 1.50 లక్షలకు మించి ఉండకూడదు. ట్రాక్టర్‌ ఉన్నా.. ఏడు సంవత్సరాలుగా ఇంకో ట్రాక్టర్‌ కొనుగోలు చేయని వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

ఏఏ సర్టిఫికేట్లు ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

ఆధార్‌ కార్డు తప్పని సరిగా ఉండాలి. పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టులలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. పొలం అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తప్పని సరి. ఈ పథకానికి ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌ రెండిటి ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ విషయానికి వస్తే.. తెలంగాణలో మీసేవా కేంద్రాల ద్వారా.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక, ఆన్‌లైన్‌ విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌.. https://pmkisan.gov.in/ లో ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి, ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.