iDreamPost
android-app
ios-app

రేపు మూవీ రిలీజ్.. అనుమానాస్పద రీతిలో ప్రముఖ కమెడియన్ మృతి

  • Published Jun 13, 2024 | 5:30 PM Updated Updated Jun 13, 2024 | 5:30 PM

ప్రముఖ కమెడియన్ అండ్ విలన్ కన్నుమూశాడు. సినిమా విడుదల రేపు అనగా.. ఈ రోజు అతడు అనుమానాస్పద రీతితో మరణించడాన్ని గుర్తించారు పోలీసులు. జూన్ 14న అతడు నటించిన సినిమా విడుదల కాబోతుంది.

ప్రముఖ కమెడియన్ అండ్ విలన్ కన్నుమూశాడు. సినిమా విడుదల రేపు అనగా.. ఈ రోజు అతడు అనుమానాస్పద రీతితో మరణించడాన్ని గుర్తించారు పోలీసులు. జూన్ 14న అతడు నటించిన సినిమా విడుదల కాబోతుంది.

  • Published Jun 13, 2024 | 5:30 PMUpdated Jun 13, 2024 | 5:30 PM
రేపు మూవీ రిలీజ్.. అనుమానాస్పద రీతిలో ప్రముఖ కమెడియన్ మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదు నెలల కాలంలో అనేక మంది సినీ దిగ్గజాలను ఇండస్ట్రీ కోల్పోయింది. ఈ వారంలో టాలీవుడ్ బడా నిర్మాత, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, ఈనాడు సంస్థల గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి విదితమే. ఆ తర్వాత మరో నటి అనుమానాస్పద రీతిలో మరణించడం కలవర పాటుకు గురిచేస్తుంది. బాలీవుడ్ నటి నూర్ మాలాబికా దాస్.. ముంబయిలోని తన ఇంటిలో శవమై కనిపించిన సంగతి విదితమే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో హాస్య నటుడు కమ్ విలన్ మరణించాడు. అతడు కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయినట్లు తెలుస్తుంది.

కోలీవుడ్ ప్రముఖ కమెడియన్, విలన్ ప్రదీప్ కె విజయన్ అనుమాన్పద రీతిలో మరణించాడు. తమిళనాడులోని పాలవాక్కంలోని అతని ఇంట్లో శవమై కనిపించాడు. గత రెండు రోజులుగా అతని స్నేహితులు ఫోన్ చేస్తుండగా.. ఎటువంటి రిప్లై రావడం లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి చూడగా.. నిర్జీవంగా పడి ఉంటాన్ని చూశారు. అయితే గుండెపోటుతో మరణించినట్లు తొలుత అంచనాకు వచ్చారు. కానీ అతడి తలకు గాయమై చనిపోయినట్లు తెలుస్తుంది. నటుడు ప్రదీప్‌కు వివాహం కాలేదు. పాలవాక్కంలోని శంకరపురం మొదటి వీధిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే ఇటీవల అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం కమ్మినట్లు అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.

కాగా, స్నేహితుల్లో ఫోన్ చేస్తుండగా.. రిప్లై ఇవ్వకపోవడంతో ఓ ఫ్రెండ్ అతని ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. అతడు ఎంతకు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. నీలకంరై పోలీసులు అగ్ని మాపక శాఖ సాయంతో ఇంటి తలపులు పగుల గొట్టి చూడగా.. ప్రదీప్ తలకు గాయపై చనిపోయాడు. మృతదేహాన్ని రాయపేట ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చి.. కింద పడి ఉంటాడని, అప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయి ఉంటాని భావిస్తున్నారు పోలీసులు. ప్రదీప్ టెడ్డీ, ఇరంబు తిరై (అభిమన్యుడు), లిఫ్ట్, మనం, కెనడీ క్లబ్, ఆడై, హే సినామిక వంటి చిత్రాల్లో నటించాడు. రుద్రన్ మూవీలో కూడా కనిపించాడు. విజయ్ సేతు పతి మహారాజా చిత్రంలో యాక్ట్ చేశాడు. రేపు (జూన్ 14) సినిమా విడుదలవుతుండగా.. అంతలోనే మృతి చెందాడు ప్రదీప్.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఎలా మరణించాడో వివరాలు వెల్లడించనున్నారు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetBelugabahisjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio