iDreamPost

‘జైలర్’ మూవీలో రజినీకాంత్ కు మనవడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

  • Author Soma Sekhar Published - 04:26 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 04:26 PM, Mon - 25 September 23
‘జైలర్’ మూవీలో రజినీకాంత్ కు మనవడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్’. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 700 కోట్ల మేర కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సూపర్ స్టార్ కు గత దశాబ్దకాలంలో ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ రాలేదనే చెప్పాలి. తొలిరోజు నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్లింది జైలర్ మూవీ. ఇక ఈ సినిమాలో రజినీకి మనవడిగా నటించిన బుడ్డోడి యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్ ఫర్పామెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడీ బుడతడు. గతంలో కార్తీ నటించిన ‘సర్దార్’ చిత్రంలో కూడా నటించాడు ఈ పిల్లాడు. ఈ బుడ్డోడు డైరెక్టర్ నెల్సన్ కు ఏమవుతాడో తెలుసా? అతడు ఎవరి కొడుకో ఇప్పుడు తెలుసుకుందాం.

జైలర్ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు మనవడిగా నటించిన బుడ్డోడిని మనం అంత ఈజీగా మర్చిపోలేం. ఎందుకంటే అతడు నటించిన విధానం అలాంటింది. ఈ బుడ్డోడి పేరు రిత్విక్. సినిమాల్లోకి రాకముందే ఇతడు ఓ యూట్యూబ్ స్టార్. రిత్విక్ కు ‘రీతూ రాక్స్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఇతడికి దాదాపుగా 24 లక్షల మంది ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఈ బుడ్డోడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వీడియోలు చేస్తూ.. సెలబ్రిటీగా మారాడు. ఇలా వచ్చిన క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. గతంలో కార్తీ నటించిన సర్ధార్ మూవీలో కూడా అద్భుతమైన నటనతో అలరించాడు. తాజాగా జైలర్ మూవీలో సూపర్ స్టార్ కు మనవడి పాత్రలో మెస్మరైజ్ చేశాడు. కాగా.. ఈ రిత్విక్ ఎవరో కాదట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు బంధువే అవుతాడట. రిత్విక్ నెల్సన్ కజిన్ కొడుకేనని ఇటీవల ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నెల్సన్ దిలీప్ కుమార్. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న రిత్విక్ భవిష్యత్ లో ఏ రేంజ్ కు వెళ్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Rithvik J (@rithvik_rithu_j)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి