iDreamPost

Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎన్ని లక్షలో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాకియి తీసుకు వెళ్లిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించడమే కాదు.. డార్లింగ్ ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం సలార్ హిలో తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు ప్రభాస్.

తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాకియి తీసుకు వెళ్లిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించడమే కాదు.. డార్లింగ్ ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం సలార్ హిలో తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు ప్రభాస్.

Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎన్ని లక్షలో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి కుమారుడు ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ నటించిన మొదటి చిత్రం బాగానే హిట్ అయినా.. కొన్ని చిత్రాలు అపజయం పాలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటూ అభిమానులు తెగ మెచ్చుకున్నారు..  ఇక బాహుబలి, బాహుబలి2 తో పాన్ హీరోగా మారాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తెరపై ప్రభాస్ కనిపిస్తే చాలు.. వందల కోట్ల కలెక్షన్లు గ్యారెంటీ అనే రేంజ్ కి ఎదిగాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ గురించి ఇప్పుడు నెట్టింగ తెగ సెర్చింగ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే మొదటి వరుసలో ఉండేది ప్రభాస్. నటుడిగా ఎంత క్రేజ్ ఉన్నా.. ఒక్కసారి షూటింగ్ నుంచి బయటికి వస్తే తన ప్రపంచమే వేరు అంటారు ప్రభాస్ సన్నిహితులు. ఎలాంటి కాంట్రవర్సీ లేని హీరో.. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు, నటీనటులు ఎవరిని అడిగినా ప్రభాస్ గొప్ప మనసున్న మారాజు అంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయిన తగిన సహాయం చేస్తారని అంటారు.

prabhas food cost

ఇక ప్రభాస్ పర్సనల్ జీవితానికి వస్తే.. ఆయన మంచి భోజన ప్రియుడు. ఎన్నో రకాల వంటకాలను ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెడుతుంటారు. షూటింగ్ సెట్లో ప్రభాస్ తనకోసం మాత్రమే కాదు.. తనతో ఉన్నవారందరికీ ఇంటి నుంచి భోజనం తెప్పించి అవి తినిపిస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని ప్రభాస్ గురించి తెలిసిన వాళ్లు అంటుంటారు. ప్రభాస్ ఇంటికి వెళ్లినవారికి దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తారని టాక్. ప్రభాస్ కి ఎంతో ఇష్టమైన వంటకాల్లో ఒకటి నాటుకోడి పులుసు. ఆ పులుసులో గారెలు నంచుకొని భలే ఇష్టంతో తింటారట. నాటుకోడి ఎన్ని రకాలుగా వండినా లాగించేస్తారట ప్రభాస్. దాంతోపాటు మాగాయి పచ్చడి, వాళ్ల అమ్మచేసే పప్పు కూడా బాగా ఇష్టపడతారట. ప్రభాస్ షూటింగ్ ఎక్కడ ఉన్నా ఫుల్ గా వెజ్ – నాన్ వెజ్ వంటకాలు చుట్టూ ఉండాల్సిందే అంట.. అతను ఒక్కడు మాత్రమే కాదు తనతోపాటు కనీసం 20 మంది వరకు కలిసి భోజనం చేయాల్సిందే అంటారు ఆయన సన్నిహితులు.

ప్రభాస్ తన ప్రియమైన వారికి ఇంటి భోజనం పంపించడం అలావాట.. ఈ విషయం రాజమౌళి, పూజాహెగ్డె,కృతిసనన్, శ్రద్దాదాస్ నుంచి ఇటీవల సలార్ లో నటించిన ఫృథ్విరాజ్ వరకు చెప్పారు. ఇక ఇన్ స్ట్రాలో ప్రభాస్ ఇచ్చిన భోజనానికి సంబంధించిన ఫోటోలు అప్ లోడ్ చేస్తుంటారు. ప్రభాస్ కోసం ఓ ప్రత్యేకమైన కుకింట్ టీమ్ ఉంటుందని టాక్. వీళ్లు ప్రభాస్ కి ఏ ఫుడ్ కావాలో అడిగి ప్రత్యేకంగా ఆయన ఇష్టపడే విధంగా వండిపెడుతుంటారట. నాన్ వెజ్ లో ఎక్కువగా నాటుకోడి, చేపలు, రొయ్యలు, మటన్ తో ఎన్నోరకాల వెరైటీలు వండిపెడతారట. ఫుడ్ తో పాటు ప్రొటీన్స్ కి సంబంధించిన ఫుడ్ కూడా తింటారట. వీటి ఖరీదు రోజు దాదాపు 2 లక్షల వరకు ఉండొచ్చు అని ఇండస్ట్రీ టాక్.  నిజమే.. వెరైటీ వంటలకు ఆ మాత్రం ఖర్చు ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.   ప్రభాస్ లాంటి కటౌట్ కి ఆమాత్రం ఫుడ్ ఖర్చు ఉండాల్సిందే అని అభిమానుల, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి