iDreamPost
android-app
ios-app

మంచు విష్ణు ‘కన్నప్ప’ సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. పోస్టర్ వైరల్!

  • Published May 09, 2024 | 7:35 PM Updated Updated May 09, 2024 | 7:35 PM

Prabhas Joins Kannappa Sets: మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డార్లింగ్ ప్రభాస్ కూడా కన్నప్ప సెట్స్ లో అడుగు పెట్టాడు. టీమ్ అధికారిక పోస్టర్ కూడా విడదుల చేసింది.

Prabhas Joins Kannappa Sets: మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డార్లింగ్ ప్రభాస్ కూడా కన్నప్ప సెట్స్ లో అడుగు పెట్టాడు. టీమ్ అధికారిక పోస్టర్ కూడా విడదుల చేసింది.

  • Published May 09, 2024 | 7:35 PMUpdated May 09, 2024 | 7:35 PM
మంచు విష్ణు ‘కన్నప్ప’ సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. పోస్టర్ వైరల్!

టాలీవుడ్ నుంచి ఇప్పటికే ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. అసలు పౌరాణికం, పురాణాలు, ఇతిహాసాల మీద చిత్రాలు అంటే పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్ ని కొట్టడం కష్టమనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ఒక బిగ్ ప్రాజెక్ట్ తో మంచు విష్ణు వస్తున్న విషయం తెలిసిందే. మన పురాణాల ప్రకారం ఆ మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రులైన భక్తుల్లో భక్త కన్నప్ప కూడా ఒకడు. ఆయన జీవితాన్నే కథాంశంగా తీసుకుని మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రమే కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వరుస అప్ డేట్స్ తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే.. డార్లింగ్ ప్రభాస్ భక్త కన్నప్ప షూటింగ్ లో పాల్గొన్నాడు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నారు. ఈ మూవీలో మంచు విష్ణు భక్త కన్నప్పగా చేస్తుండగా.. అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 చిత్రంలో శివుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే అక్షయ్ కుమార్ ను ఈ పాత్రకు ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి ప్రభాస్ ను శివుడి పాత్ర చేయమని మంచు విష్ణు కోరగా.. డార్లింగ్ సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు.

శివుడి పాత్రకు మాత్రమే ప్రభాస్ నో చెప్పాడు. కానీ, కన్నప్పలో మాత్రం తాను యాక్ట్ చేస్తానని మాటిచ్చాడు. దానికి తగినట్లుగా ప్రభాస్ నదీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఎంట్రీకి సంబంధించి కన్నప్ప టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ కన్నప్ప షూట్ లో పాల్గొన్నాడు అంటూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ప్రభాస్ లుక్స్ ని మాత్రం రివీల్ చేయలేదు. కేవలం కాళ్లను మాత్రమే చూపించారు. సెట్స్ లో అడుగు పెట్టాడు అనే విషయానికి సింక్ అయ్యేలా ఆ పోస్టర్ ఉంది.

ప్రభాస్ కటౌట్ కి ఏ పాత్ర చేసినా అదిరిపోతుందని తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ప్రభాస్ కూడా భాగం కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ కన్నప్ప మూవీని పాన్ ఇండియా లెవల్లో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు, అక్షయ్ కుమార్, ప్రభాస్ మాత్రమే కాకుండా ఇంకా పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో అలరించనున్నారు. మరి.. కన్నప్ప సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetholiganbetcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet