iDreamPost
android-app
ios-app

తలపడనున్న పుష్ప 2- కల్కి చిత్రాలు..! ఇది బాక్సాఫీస్ ఊచకోతే

డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీతో బిజీగా ఉన్నాడు. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 కోసం టైం కేటాయిస్తున్నాడు. కల్కి మే 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ అంతలోనే

డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీతో బిజీగా ఉన్నాడు. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 కోసం టైం కేటాయిస్తున్నాడు. కల్కి మే 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ అంతలోనే

తలపడనున్న పుష్ప 2- కల్కి చిత్రాలు..! ఇది బాక్సాఫీస్ ఊచకోతే

సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోరాటాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలో.. మొన్న ఫిబ్రవరిలో కూడా కొన్ని చిత్రాల రిలీజ్ డేట్ల విషయంలో క్లాషెస్ వచ్చాయి. హనుమాన్, గుంటూరు కారం జనవరి 12న వస్తున్నామని చెప్పి.. కాస్త కలవరపాటుకు గురి చేశాయి. ఎవరి చిత్రంపై వారు నమ్మకంతో వెనక్కు తగ్గలేదు. కానీ రెండు చిత్రాలకు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో ఆ సమస్య సమసిపోయింది. తాజాగా ఈగల్, ఊరిపేరు భైరవ కోన సినిమాల రిలీజ్ విషయంలో కూడా ఇదే సమస్య తలెత్తగా.. పెద్దల చర్చలతో ఓ స్టెప్ వెనక్కు వేసింది సందీప్ కిషన్ మూవీ. ఈసారి కూడా ధియేటర్ల క్లాష్ వచ్చేట్లు కనిపిస్తుంది. అలాంటి, ఇలాంటి సినిమాలు కాదూ.. రెండు పాన్ ఇండియా చిత్రాలు.. తెలుగు ఇండస్ట్రీ బడా హీరోలు బాక్సాఫీసు వార్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ మోస్ట్ ఎవటైడ్ మూవీ డార్లింగ్ ప్రభాస్ కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్సనల్ పిక్చర్ మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అఫీషియల్ ఎనౌన్సెమెంట్ కూడా వచ్చేసింది. అయితే అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండనున్నాయి. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అలాగే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహించనున్నారు. ఎన్నికల హడావుడిలో సినిమాలపై ప్రేక్షకుల దృష్టి సారించే అవకాశాలు ఉండవని భావిస్తోందట కల్కి టీం. దీంతో కల్కి మూవీ విడుదల వాయిదా వేయాలని, దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతుంది.

ఇంతలో ప్రభాస్ ఫ్యాన్స్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కారణం అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వారే కారణం. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరిని అల్లు అర్జున్ అభిమానులు దాడి చేసిన ఘటన వైరల్ అయిన సంగతి విదితమే. ఈ ఫ్యాన్స్ వార్.. ఇప్పుడు సినిమాలకు ఆపాదిస్తున్నారు. పుష్ప 2 విడుదలయ్యే అవకాశాలున్న ఆగస్టు 15న కల్కి చిత్రం కూడా రిలీజ్ చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా, అల్లు అర్జున్- ప్రభాస్ బయట మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి విదితమే. పుష్పతో హిట్ కొట్టి..జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న అల్లు అర్జున్, పుష్ప 2 షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. సో.. దసరా పండుగ సమయంలో కాకుండా.. ఆగస్టులోనే అదీ కాకుండా పుష్ప 2కు సినిమా విడుదల చేస్తే.. భీభత్సం కాదు కదా.. థియేటర్లు ఊచకోత ఖాయమని అర్థమౌతుంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet