iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అక్కడ ఒక్కరోజు ముందుగానే కల్కి రిలీజ్‌

  • Published Jun 11, 2024 | 11:10 AM Updated Updated Jun 11, 2024 | 11:10 AM

ప్రభాస్‌ కల్కి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాను జూన్‌ 27న విడుదల చేస్తుండగా.. ఓ చోట మాత్రం ఒక్క రోజు ముందుగానే ప్రదర్శించనున్నారు. ఆ వివరాలు..

ప్రభాస్‌ కల్కి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాను జూన్‌ 27న విడుదల చేస్తుండగా.. ఓ చోట మాత్రం ఒక్క రోజు ముందుగానే ప్రదర్శించనున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 11:10 AMUpdated Jun 11, 2024 | 11:10 AM
Kalki 2898 AD: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అక్కడ ఒక్కరోజు ముందుగానే కల్కి రిలీజ్‌

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉన్న చిత్రం ఏదైనా ఉందంటే.. ప్రభాస్‌-నాగ్‌ అశ్విని కాంబినేషన్‌లో వస్తోన్న కల్కి: 2898 ఏడీ. భారీ బడ్జెట్‌, తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవ్‌ పాత్రలో నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వద్థామ పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు కమల్‌ హాసన్‌ కూడా ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దీనిలో బ్రహ్మానందం కూడా ఉన్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. అయితే సోమవారం నాడు విడుదలైన కల్కి ట్రైలర్‌.. సంచలనాలకు వేదికగా మారింది. ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యి 24 గంటలు కూడా కాలేదు.. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది.

ఈక్రమంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పారు మేకర్స్‌. వారి కోసం ఒకరోజు ముందుగానే కల్కి సినిమాను ప్రదర్శించనున్నారు. ఆ వివరాలు.. ప్రభాస్‌ కల్కి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 27న విడుదల కానుంది. అయితే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే అనగా జూన్ 26నే మొదటి ఆట పడనుంది. రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్‌ కానుంది. బీఎఫ్ఐలో ఒక సినిమా ప్రీమియర్‌ షో పడటం చాలా అరుదు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని కూడా ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Kalki release

ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రస్తుతం కల్కి టీమ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. భారీతీయ సినీ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో.. కల్కి మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత.. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న బుజ్జిని పాన్ ఇండియా లెవల్లో ప్రతి సిటీకి పంపి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన కల్కి ట్రైలర్‌.. ఆ అంచనాలను పదింతలు పెంచింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంతా హాలీవుడ్ రేంజ్‌ మూవీ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ట్రైరల్‌ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కదా మా అన్న రేంజ్‌.. ఇలాంటి సినిమా కదా మాకు కావాల్సింది అంటున్నారు. ఫిల్మ్‌ మేకర్స్‌ సైతం కల్కి ఒక విజువల్ వండర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినిమాలో ఈ తరహా సీన్స్, టేకింగ్ అస్సలు ఊహించలేదు అంటున్నారు. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్లో కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కథ పరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş