iDreamPost

Kalki 2898AD: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! కల్కి రిలీజ్ డేట్ మారనుందా?

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. కల్కి రిలీజ్ డేట్ మారబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. మరి ఏ డేట్ లో డార్లింగ్ రాబోతున్నాడు? విడుదల తేదీ ఎందుకు మారుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. కల్కి రిలీజ్ డేట్ మారబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. మరి ఏ డేట్ లో డార్లింగ్ రాబోతున్నాడు? విడుదల తేదీ ఎందుకు మారుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Kalki 2898AD: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! కల్కి రిలీజ్ డేట్ మారనుందా?

‘కల్కి 2898 ఏడీ‘.. పాన్ ఇండియా రేంజ్ ను దాటుకుని హాలీవుడ్ స్థాయిలో విడుదలకు సిద్దమవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ తేదీన కల్కి థియేటర్లలోకి రావడం కష్టంగానే ఉంది. విడుదలకు ఇంకా నెల రోజులే ఉండటం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ఇతర పనులు జరుగుతుండటంతో.. అనుకున్న ప్రకారం కల్కి రిలీజ్ కావడం కష్టంగా మారింది. వీటితో పాటుగా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దీంతో కల్కి విడుదల తేదీ మారనుంది అంటూ గట్టిగా టాక్ వినిపిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. దాదాపుగా ఈ చిత్రం షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో అనుకున్న టైమ్ కు అంటే మే 9న ప్రభాస్ థియేటర్లలోకి వస్తాడని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. కల్కి రిలీజ్ డేడ్ మారబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు కారణాలు ఏకపోలేదు. కల్కి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండటంతో జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లో ఉండరని బయ్యర్లు చెబుతున్నారు. దీంతో టీమ్ సైతం ఆలోచనలో పడినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Bad news for Prabhas fans

ఇదిలా ఉండగా.. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. కల్కి మే 30న థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. స్కూళ్లకు, కాలేజీలకు వేసవి సెలవులు కావడంతో.. ఓపెనింగ్స్, కలెక్షన్ల విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పైగా బాహుబలి 2, కేజీఎఫ్ లాంటి మూవీస్ సమ్మర్ లోనే వచ్చి.. భారీ వసూళ్లను కొల్లగొట్టాయి. మే 30వ తారీఖు లోగా ఏపీలో పొలిటికల్ హీట్ చల్లారుతుంది. దీంతో కల్కికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న తమ హీరో సినిమాను చూద్దామనుకుంటే.. వెనక్కి పోతుండటంతో.. అసంతృప్తికి గురవుతున్నారు. ఇక కల్కి రిలీజ్ డేట్ పై వీలైనంత త్వరగా క్లారిటీ వస్తే తప్ప ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వలేరని మాత్రం కచ్చితంగా చెప్పగలం.

ఇదికూడా చదవండి: Devara: దేవరలో టిల్లు ఉన్నాడా? బిగ్ సర్ఫ్రైజ్ అంటున్న సిద్దూ! పోస్ట్ వైరల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి