iDreamPost
android-app
ios-app

‘భజే వాయువేగం’ మూవీ షూటింగ్ కు తన కాస్ట్లీ కారు ఇచ్చిన ప్రభాస్! డార్లింగ్ అంటే ఆ మాత్రం ఉంటది..

  • Published Jun 01, 2024 | 8:19 AM Updated Updated Jun 01, 2024 | 8:19 AM

కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ 'భజే వాయువేగం' షూటింగ్ కోసం ప్రభాస్ తన ఖరీదైన కారును ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ 'భజే వాయువేగం' షూటింగ్ కోసం ప్రభాస్ తన ఖరీదైన కారును ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

‘భజే వాయువేగం’ మూవీ షూటింగ్ కు తన కాస్ట్లీ కారు ఇచ్చిన ప్రభాస్! డార్లింగ్ అంటే ఆ మాత్రం ఉంటది..

టాలీవుడ్ లో హీరోల మధ్య  మంచి వాతావరణం ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక హీరో మరో హీరోకు సాయం చేస్తూ.. ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనకు చేసిన గొప్ప సాయం గురించి చెప్పుకొచ్చాడు హీరో కార్తికేయ. ‘భజే వాయువేగం’ కార్తికేయ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ ను సంపాదించుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఎవ్వరికీ తెలియని నిజాన్ని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించాడు కార్తికేయ. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తికేయ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భజే వాయువేగం’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ కు ముందు.. మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో కార్తికేయ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రానికి డార్లింగ్ చేసిన సాయం గురించి కార్తికేయ చెప్పుకొచ్చాడు. మా చిత్రానికి స్టార్ హీరోలు అందరూ సపోర్ట్ చేశారని తెలిపాడు.

Prabhas his costly car gave hero karthikeya movie

ఆ ఈవెంట్ లో కార్తికేయ మాట్లాడుతూ..”మా సినిమాకు చాలా మంది హీరోలు సపోర్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మెగాస్టార్ టీజర్ రిలీజ్ చేశారు. ఇలా వారివారి సహకారాలు అందించారు. ఇక డార్లింగ్ ప్రభాస్ అయితే ఏకంగా తన కాస్ట్లీ కారునే షూటింగ్ కోసం ఇచ్చారు. జాగ్వార్ ఎక్స్ కారును మా మూవీలో యాక్షన్ సీన్స్ కోసం వాడుకొన్నాం. ఆయనకు ధన్యవాదాలు” అంటూ ప్రభాస్ షూటింగ్ కు కారు ఇచ్చిన విషయం అందరికి తెలియజేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు డార్లింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే.. ఈ చిత్రంలో కార్తికేయ చేసే యాక్షన్స్ సీన్స్ లో జాగ్వార్ కారును వాడారు. ప్రభాస్ తన  కారును ఇవ్వడానికి ఇక్కడ మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భజే వాయువేగం చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించింది. ఇందులో ప్రభాస్ కు కూడా పార్ట్ నర్ షిప్ ఉంది. అందుకే తన కారును డార్లింగ్ ఇచ్చి ఉంటారు అని కొందరు అంటున్నారు. కానీ ప్రభాస్ ఆ యాంగిల్ లో ఆలోచించి ఇవ్వలేదని, సాయం కోరి వస్తే.. ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వేరే హీరో షూటింగ్ కోసం ప్రభాస్ తన కాస్ట్లీ కారును ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş