iDreamPost
android-app
ios-app

శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్

  • Author Soma Sekhar Published - 07:12 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 07:12 PM, Tue - 26 September 23
శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ విన్న సగటు సినీ ఫ్యాన్స్ తో పాటుగా.. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా షాక్ కు గురవుతున్నారు. ఆ న్యూస్ ఏంటంటే? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘భక్త కన్నప్ప’ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటో లీక్ చేసింది అలనాటి అందాల తార మధుబాల. భక్త కన్నప్ప మూవీలో శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతారలు నటిస్తారని చెప్పుకొచ్చింది మధుబాల. ప్రస్తుతం ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవలే శ్రీకాళహస్తీ ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. సినిమాకు సంబంధించిన సామాగ్రిని 8 కంటైనర్లలో న్యూజిలాండ్ కు తాజాగా తరలించారు. భక్త కన్నప్పను హిందీలో మహాభారత్ సీరియల్ ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం 8 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపాం అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీకి సంబంధించి మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.

కాగా.. భక్త కన్నప్పకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? భక్త కన్నప్పలో శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతారలు నటిస్తున్నారని చెప్పుకొచ్చింది అలనాటి అందాల తార మధుబాల. తాజాగా ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భక్త కన్నప్పలో ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా నటించబోతున్నారని చెప్పింది మధుబాల. అయితే ఈ సినిమా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభాస్, నయన్ కలిసి నటించబోతున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న భక్త కన్నప్ప కోసం ఏకంగా 600 మంది సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగుతున్నారట. ఇక ఈ సినిమా కథను టాలీవుడ్ స్టార్ రైటర్లు అయిన పరుచూరి, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి లు కలిసి అద్భుతంగా మలిచారని తెలుస్తోంది. మరి మధుబాల చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by actorprabhas (@fan.of.prabhas01)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap