iDreamPost
android-app
ios-app

నేను చనిపోతే.. నా శవాన్ని ఇండస్ట్రీలో ఎవడికీ చూపించొద్దు: పోసాని కృష్ణమురళి

  • Author Soma Sekhar Published - 08:36 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 08:36 AM, Mon - 21 August 23
నేను చనిపోతే.. నా శవాన్ని ఇండస్ట్రీలో ఎవడికీ చూపించొద్దు: పోసాని కృష్ణమురళి

పోసాని కృష్ణమురళి.. రైటర్ గా, విలక్షణ నటుడి, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. నంది అవార్డులపై షాకింగ్ కామెంట్స్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు పోసాని. ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం పోసానిది. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు ఆయన. తాను చనిపోతే తన శవాన్ని ఇండస్ట్రీలో ఎవడికీ చూపించొద్దంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన భార్యను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తూ వస్తున్నానని ఎమోషనల్ అయ్యారు పోసాని.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను చనిపోతే నా శవాన్ని ఇండస్ట్రీలో ఎవడికీ చూపించకూడదని పేర్కొన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం, భార్య గురించి ఎమోషనల్ గా మాట్లాడారు ఆయన. పోసాని మాట్లాడుతూ..”ఇప్పటి వరకు నాకు ఎలాంటి భయం, బాధ, అభద్రతాభావం అనేవి లేవు. ఇవన్నీ నాకు మా అమ్మ వల్ల వచ్చినవే. ఆమె ఫొటో చూస్తే చాలు అన్ని మర్చిపోతా. ఇక నాకు లైఫ్ లో ఎలాంటి ఆశలూ లేవు. ఇప్పటికిప్పుడు నన్ను ఎవడైనా గొంతుకోసి చంపినా.. కన్నీరు పెట్టుకోవద్దని నా భార్యకు చెప్పాను.

ఒకవేళ నేను చనిపోతే.. నా శవాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎవడికీ చూపించొద్దని మా ఆవిడకి చెప్పాను. ఎందుకంటే వారు నా శవాన్ని చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇక నా శవంపై ఎవ్వరూ సానుభూతి చూపించకూడదు. నేను చనిపోతే నా భార్య ఎలా బతుకుతుందో అన్న భయం లేదు. ఎందుకంటే ఆమె పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తి రాసిపెట్టాను. నా వారసులు ఎక్కడ ఉంటారో తెలీదు కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యా” అంటూ ఎమోషనల్ అయ్యారు పోసాని. ఎంతో గొప్పగా బతికిన తన శవాన్ని బంధువులు, రక్త సంబంధీకులు తప్ప ఎవ్వరూ చూడకూడదని పోసాని తెలిపారు.

తాను చనిపోయాక ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్లకు టీలు, కాఫీలు ఇచ్చి నాతో గడిపిన ఈ జీవితాన్ని నవ్వుతూ వారికి చెప్పు అని నా భార్యకు చెప్తుంటాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నా భార్యకు నెలకు రూ. 8 లక్షల నుంచి 9 లక్షల వరకు డబ్బులు వస్తాయి. వాటితో నువ్వు హాయిగా బతకొచ్చు అని ఆమెతో చెప్పాను, ఇక నేను పోతే ఎలా బతకాలో నా భార్యకు వివరంగా చెప్పాను అంటూ భావోద్వేగానికి గురైయ్యారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి పోసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి లగ్జరీ విల్లా!

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet