• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Political Analysis On Us President Elections

డొనాల్డ్ ట్రంప్ ఓటమిపై ఎందుకింత చర్చ, మోడీ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయా..?

  • By idream media Published Date - 04:55 AM, Sun - 8 November 20 IST
డొనాల్డ్ ట్రంప్ ఓటమిపై ఎందుకింత చర్చ, మోడీ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయా..?

డొనాల్డ్ ట్రంప్. కేవలం నాలుగేళ్లు మాత్రమే అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగారు. కానీ నాలుగు దశాబ్దాలకు పైగా గుర్తుండిపోయే నాయకుడిగా మారారు. నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష పదవికి ఆయన అనూహ్య రీతిలోఎన్నికయ్యారు. ఆనాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ని ఎదుర్కొన్న ట్రంప్ విజయం కూడా సంచలనమే. ఆ తర్వాత నాలుగేళ్ల పాలనలో అడుగడుగునా సంచలనాలే. ఆయన విధానాల కన్నా మాటలు, చేతలు, మీడియాలో వ్యవహారాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ప్రపంచమంతా ఆయన పేరు మారుమ్రోగేందుకు దోహదపడ్డాయి. వాస్తవానికి ఆయన ఎన్నికల్లో గెలిచిన నాడే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు తీరా తన ఓటమిని ఆయన అంగీకరించనని ప్రకటించే స్థాయికి చేరింది.

అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా ప్రపంచ ఆధిపత్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత అధ్యక్ష పీఠం ఎక్కిన నేతల తీరులో ఇది స్పష్టంగా గోచరిస్తుంది. తాము కేవలం వైట్ హౌస్ కి మాత్రమే బాస్ అని మరచిపోయి విశ్వానికే తాము హెడ్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కానీ అదంతా అంతర్గత వ్యవహారంగా ఉంటుంది. ట్రంప్ మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరించారు. తాను అనుకోవడమే కాదు.. తాను అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రపంచమంతా భావించాలని ఆయన కోరుకున్నారు. అందుకు అనుగుణంగా మాటల్లో, చేతల్లో చూపించారు. ఉత్తర కొరియా కిమ్ తో కలహం నుంచి తాజాగా చైనాతో గిల్లికజ్జాల వరకూ అన్నింటా ట్రంప్ మాటల దూకుడు చూపించారు. చేతల కన్నా ప్రచారంతో ప్రత్యర్థులను కట్టడి చేయాలని చూశారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అమెరికా ప్రజల్లోని ఓ వర్గం ప్రజలను సంతృప్తి పరిచేందుకు ప్రాధాన్యతనిచ్చారు.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మితవాద నేతలకు జనం పట్టం గడుతున్న సమయంలో అమెరికా పీఠం కైవసం చేసుకున్న ట్రంప్ అలాంటి నేతలందరితో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు. ఆక్రమంలోనే మోడీతో సన్నిహితంగా మెలిగారు. బ్రెజిల్, ఇండియా,, యూఎస్ అధ్యక్షుల మధ్య స్నేహం లోకమంతా విదితమే. దాని ప్రభావంతో చివరకు మోడీ నేరుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి దోహదం చేసింది. హౌడీ మోడీ అంటూ ఏడాది క్రితం అమెరికాలో ట్రంప్ ని కీర్తించేందుకు ప్రయత్నం చేసిన మోడీ, ఆతర్వాత నమస్తే ట్రంప్ అంటూ అహ్మదాబాద్ లో భారీ హంగామా చేశారు. కోవిడ్ భయం వెంటాడుతున్నా విస్మరించి ఎన్ ఆర్ ఐ లను ఆకర్షించడమే లక్ష్యంగా సాగారు. చివరకు మోడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదనడానికి ఎన్ ఆర్ ఐలలో అత్యధికులు బైడెన్ కి జై కొట్టడమే సంకేతం.

వాస్తవానికి మోడీ, ట్రంప్ మధ్య స్నేహానికి మరో కారణం కూడా ఉంది. 2002లో మోడీ గుజరాత్ సీఎం పీఠం ఎక్కగానే జరిగిన మారణహోమం పట్ల ప్రపంచమంతా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలోనే మోడీని అమెరికా లో కాలుపెట్టకుండా వీసా పై ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత మోడీ వీసా మీద ఆంక్షలు తొలగించడానికి చేసిన వివిధ ప్రయత్నాలు వైస్ ప్రెసిడెంట్ హోదాలో జో బైడెన్ పలుమార్లు అడ్డుకున్నారు. ససేమీరా అన్నారు. చివరకు ఇటీవల కశ్మీర్ విషయంలో, సీఏఏ చట్టాల తీసుకురావడంలో మోడీ సర్కారు తీరుని బైడెన్ తప్పుబట్టారు. ఇలా బైడెన్, మోడీ మధ్య సుదీర్ఘకాల విరోధం కూడా ఉండడంతో అనివార్యంగా శత్రువుకి శత్రువు మిత్రుడిగా మారినట్టు చెప్పవచ్చు. ఇక జాతి, దేశభక్తి వంటి అనేక అంశాలలో సన్నిహిత భావనలు కలిగిన ట్రంప్, మోడీ చేతులు కలపడం పెద్ద విశేషం కాదు. కానీ ఇప్పుడు మోడీ ప్రచారం చేసినా ఇండో అమెరికన్లు భిన్నంగా ఆలోచించారు. ట్రంప్ ని సాగనంపారు. కరోనా విషయంలో ట్రంప్ మొండి వైఖరి పట్ల అమెరికన్లకే విసుగొచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఆశించిన దానికన్నా ఘోర ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం ప్రపచంలోని పలు దేశాల్లో ట్రంప్ ఓటమి, బైడెన్ రాకతో ఒనగూరేదేమీ లేకపోయినా ట్రంప్ లాంటి వాచలత్వం ఉన్న అమెరికా అద్యక్షుడి ఓటమిని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది. అనేక దేశాల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాల పట్ల ఆసక్తి పెరగేందుకు ట్రంప్ ధోరణి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. అదే సమయంలో మనదేశంలో మోడీ , ఆయన అనుచరులు చివరి వరకూ ఆశించినట్టు ట్రంప్ కి రెండోసారి అధికారం దక్కకపోవడం కీలక పరిణామాలకు కారణం కాబోతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులున్నప్పటికీ ఇండో-అమెరికా అధినేతల మధ్య సంబంధాల్లో మార్పు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. అయితే అమెరికాలో ట్రంప్ కారణంగా ఏర్పడిన పోలరైజేషన్ ప్రభావం మాత్రం ఆ దేశాన్ని మరికొంత కాలం వెంటాడే అవకాశం ఉంటుంది. డెమెక్రాట్లలో మితవాదిగా పేరున్న బైడెన్ కారణంగా అది ఏమేరకు చల్లారుతుందన్న దానిని బట్టి అమెరికన్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Tags  

  • Donald Trump
  • Joe Biden
  • Narendra Modi
  • US Elections

Related News

రక్తంతో  మోదీకి లేఖ రాసిన ప్రముఖ నటుడు..

రక్తంతో మోదీకి లేఖ రాసిన ప్రముఖ నటుడు..

కావేరీ నదీ జలాల విషయంలో గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడుల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తమిళనాడు వాటాగా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయ, సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన,  ఆందోళనల వలన సమస్య పరిష్కారం కాదని.. ప్రభుత్వాలే కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు న్యాయం కోరుతూ.. ప్రముఖ […]

2 hours ago
తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

20 hours ago
అధికారులకు చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడి కుక్క!

అధికారులకు చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడి కుక్క!

5 days ago
నా తండ్రి చనిపోయారు.. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. ట్రంప్ కుమారుడి ట్వీట్ వైరల్

నా తండ్రి చనిపోయారు.. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. ట్రంప్ కుమారుడి ట్వీట్ వైరల్

2 weeks ago
అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

2 weeks ago

తాజా వార్తలు

  • రతిక క్రేజ్.. బిగ్ బాస్ లో అన్ని లక్షలు సంపాదించిందా!
    1 min ago
  • భార్యా, బిడ్డను చంపాడు.. ఆ పాపం ఊరికే పోతుందా!..
    13 mins ago
  • టీమిండియాను ఆపడం సాధ్యం కాదు.. ఆ జట్టే నా ఫేవరెట్: బ్రాడ్
    25 mins ago
  • ఆసియా గేమ్స్‌: చైనా కుటిల బుద్ది.. గోల్డ్‌ మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి
    35 mins ago
  • వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బలాలు, బలహీనతలు! ఆరో కప్ గెలిచే ఛాన్స్? 
    56 mins ago
  • టీమిండియాతో మ్యాచ్​ అంటే పాకిస్థాన్​ భయపడుతోంది: మాజీ క్రికెటర్
    58 mins ago
  • మాజీ మంత్రి నారాయణ​కు సీఐడీ నోటీసులు.. లోకేష్‌తో కలిపి విచారణ
    1 hour ago

సంఘటనలు వార్తలు

  • విషాదం: GPS చూస్తూ కారు నడిపిన ఇద్దరు డాక్టర్ల బలి!
    1 hour ago
  • గాంధీ జయంతి స్పెషల్‌ ఆఫర్‌.. ఆ సినిమా ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ
    1 hour ago
  • వరల్డ్ కప్‌లో సౌత్‌ ఆఫ్రికా బలాలు, బలహీనతలు! తొలి కప్ గెలిచే ఛాన్స్? 
    2 hours ago
  • హైదరాబాద్‌లో విషాదం.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే
    2 hours ago
  • అరుదైన ఘటన: యువకుడి కడుపులో గర్భాశయం!
    2 hours ago
  • గాంధీజీ చూపిన మార్గంలోనే నడుస్తున్నాం: ముఖ్యమంత్రి జగన్
    2 hours ago
  • వారికి తెలంగాణ సర్కార్‌ భారీ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
    2 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version