iDreamPost

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదంటూ వార్తలు!

Case On Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా అవతరించి పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. అయితే పోలీసులు మాత్రం అతనికి షాకిచ్చారు.

Case On Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా అవతరించి పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. అయితే పోలీసులు మాత్రం అతనికి షాకిచ్చారు.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదంటూ వార్తలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంత అట్టహాసంగా ముగిసింది. ఆ తర్వాత కూడా అంతే హంగామా జరిగింది. అన్నపూర్ణ స్టూడియో బయట ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ప్రైవేటు వాహనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ, పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కంటెస్టెంట్స్ కార్లపై రాళ్లతో దాడికి దిగారు. కేవలం ప్రశాంత్ పై, అతని కారుపై మాత్రమే ఎలాంటి దాడి జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి కారణం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పల్లవి ప్రశాంత్- అతని ఫ్యాన్స్ పై కేసు నమోదు అయ్యిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిజంగానే అంతా ఉల్టా పుల్టాగా సాగింది. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్ లో ఇదే బెస్ట్ అంటూ నాగార్జున కూడా ప్రకటించారు. ఇండియాలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బెస్ట్ షో అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీజన్ మొత్తం ఉల్టాగా సాగడం మాత్రమే కాదు.. సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనలు కూడా అందరినీ విస్మయానికి గురి చేశాయి. నిజంగానే ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిసారి హౌస్ లో కంటెస్టెంట్స్ గొడవలు పడటం, ఒకరిని ఒకరు దూషించుకోవడం, కొట్టుకునే వరకు వెళ్లడం జరుగుతూనే ఉంటుంది. కానీ, ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు మాత్రం జరగలేదు.

ఈసారి మొదటిసారి ఇలా వాహనాలు, కంటెస్టెంట్స్ మీద దాడులు చేయడం చూశాం. అమర్ దీప్ తన ఫ్యామిలీతో ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కారును ధ్వంసం చేశారు. వెనుకవైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది. మరోవైపు అశ్వినీ శ్రీ కారుని కూడా పగలగొట్టారు. కొత్త కారు అని కూడా చూడకుండా ఫ్రంట్, బ్యాక్ విండ్ షీల్డ్ ని ధ్వంసం చేశారు. కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ కారుపై కూడా దాడి చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోయారు అంటూ ఆమె కామెంట్స్ చేసింది. ఈ ఘటనలపై అశ్వినీ, గీతూ రాయల్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనంపై కూడా దాడులు జరిగాయి ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సుమోటోగా కేసులు కూడా నమోదు చేశారంటూ చెబుతున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్- అతని ఫ్యాన్స్ పై స్వచ్ఛందంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

పోలీసులు కేసులు దాడులకు పాల్పడిన వారిపైనే పెట్టారా? పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదైందా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇంక విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కు గట్టిగానే ముట్టింది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యి టైటిల్ విన్నర్ గా అవతరించాడు. ప్రైజ్ మనీగా రూ.35 లక్షలు+ జోయాలుక్కాస్ డైమండ్ జ్యూవెలరీ కొనుగోలు కోసం రూ.15 లక్షలు+ రూ.15 లక్షలు విలువజైసే మారుతీ ఆల్ న్యూ బ్రెజా కారు, వారానికి రూ.లక్ష చొప్పున 15 లక్షల రెమ్యూనరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానంటూ చెప్పాడు. అలాగే కారుని తన తండ్రికి.. డైమండ్ నెక్లస్ ని తన తల్లికి ఇస్తానంటూ స్టేజ్ మీద ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మరి.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు అయ్యిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి