iDreamPost

Joginder Sharma: 2007 టీ20 వరల్డ్ కప్ హీరోపై కేసు! నాడు గెలిపించి.. నేడు..

అతడు ఒకప్పటి వరల్డ్ కప్ హీరో. చివరి ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అతడు ఒకప్పటి వరల్డ్ కప్ హీరో. చివరి ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Joginder Sharma: 2007 టీ20 వరల్డ్ కప్ హీరోపై కేసు! నాడు గెలిపించి.. నేడు..

అతడు ఒకప్పటి వరల్డ్ కప్ హీరో. చివరి ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. ఆ భారత మాజీ క్రికెటర్ పేరు జోగిందర్ శర్మ. ప్రస్తుతం హరియానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ సూపరిడెంట్ ఆప్ పోలీస్(DSP)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా జోగిందర్ శర్మ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరల్లోకి వెళితే..

టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం హరియాణా పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న అతడు.. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసలేం జరిగిందంటే? హిసార్ కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ తల్లి ఆస్తి గొడవల కారణంగానే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదురుగు వ్యక్తులు తమపై ఒత్తిడి తెస్తున్నారని డీఎస్సీగా ఉన్న జోగిందర్ శర్మకు ఆమె ఫిర్యాదు చేసిందట. అయితే ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా.. అతడు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. దీంతో జోగిందర్ పేరును కూడా ఈ కేసులో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

ఇక ఈ విషయంపై జోగిందర్ శర్మ స్పందించాడు. “పవన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు. అసలు నాకు ఈకేసు గురించి తెలీదు. పవన్ ను ఒక్కసారి కూడా నేను డైరెక్ట్ గా కలవలేదు” అంటూ ప్రముఖ వార్తా పత్రిక ఇండియా టుడే ఓ కథనంలో ప్రచూరించింది. ఇదిలా ఉండగా.. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో హోరాహోరిగా సాగిన పోరులో ఉత్కంఠ విజయం సాధించింది ఇండియా. ఈ మ్యాచ్ లో అప్పటి కెప్టెన్ ధోని ఆఖరి ఓవర్ ను జోగిందర్ శర్మతో వేయించాడు. ఈ మ్యాచ్ లో పాక్ గెలవాటి అంటే నాలుగు బంతుల్లో 6 రన్స్ కావాలి. ఇలాంటి టైమ్ లో అద్బుతంగా బౌలింగ్ చేసిన జోగిందర్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ధోని సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ కు 2010, 11 సీజన్లలో ఆడాడు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెట్ కు అందించిన సేవలకు గాను జోగిందర్ శర్మ కు 2011లో హరియాణా ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం ఇచ్చింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి