iDreamPost
android-app
ios-app

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్! హేమ పార్టీలోనే ఉందంటూ పోలీసుల ప్రకటన!

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ పేరిట బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఈ పార్టీలో నటి హేమ ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ పేరిట బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఈ పార్టీలో నటి హేమ ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్!  హేమ పార్టీలోనే ఉందంటూ పోలీసుల ప్రకటన!

ఇటీవల బర్త్ డే పార్టీలు, ఇతర పార్టీల పేరుతో గుట్టు చప్పుడు కాకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఈ రేవ్ పార్టీలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ సినీ సెలబ్రిటీలు పట్టుబడిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీకి దాదాపు 100 మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అయితే రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. పెద్ద ఎత్తున మద్యంతో పాటు, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రైడ్ లో తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పట్టుబడ్డారు. కాగా బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్ నటి హేమ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లు కన్నడ మీడియాలో టాక్ వినిపించింది. అయితే మొదట దీనిపై స్పందించిన హేమ తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లో ఉన్నానని తెలిపింది. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని తెలిపింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏం సంబంధంలేదని తెలిపింది. తనను ఈ వివాదంలోకి లాగొద్దంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఇక్కడే బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.

రేవ్ పార్టీకి హాజరైన వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది. పార్టీలో ఉన్నవారి లిస్టులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకటనతో నటి హేమ అడ్డంగా బుక్కై పోయారు. కాగా నటి హేమ తెలుగు, తమిళం, మళయాలం సినిమాల్లో నటించింది. వందలాది సినిమాల్లో ఆమె వివిధ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

Jojobet GirişmeritbetcasibomMeritbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetgalabetMadridbetMadridbetcasibomjojobet girişgalabetjojobetholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel GirişJojobet GirişCasibom