iDreamPost

ఫైనల్లో ఓటమి.. తీవ్ర భావోద్వేగానికి గురైన షమీని ఓదార్చిన మోదీ!

  • Published Nov 20, 2023 | 4:56 PMUpdated Nov 20, 2023 | 7:35 PM

ముచ్చటగా మూడోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడుదాం అనుకున్న టీమిండియా ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. ఈ ఓటమి బాధలో ఉన్న భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారిని భారత ప్రధాని డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి మరీ ఓదార్చారు.

ముచ్చటగా మూడోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడుదాం అనుకున్న టీమిండియా ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. ఈ ఓటమి బాధలో ఉన్న భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారిని భారత ప్రధాని డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి మరీ ఓదార్చారు.

  • Published Nov 20, 2023 | 4:56 PMUpdated Nov 20, 2023 | 7:35 PM
ఫైనల్లో ఓటమి.. తీవ్ర భావోద్వేగానికి గురైన షమీని ఓదార్చిన మోదీ!

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఓటమిని తల్చుకుంటూ బాధపడుతున్నారు. అయితే మ్యాచ్‌ చూసిన వారికే ఇంత కష్టంగా ఉంటే.. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి.. 100 కోట్లకి పైగా అభిమానుల ఆశలను భుజాలపై మోస్తూ.. విశ్వవేదికగాపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. చివరి మెట్టులో పరాయజం ఎదురైతే.. ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో కదా?. ఆ సమయంలో హృదయం ముక్కలై ఉంటుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో పరాయజం పాలైన తర్వాత.. టీమిండియా క్రికెటర్లు అలాంటి బాధనే అనుభవించారు. ఉబికివస్తున్న కన్నీళ్లను కొంతమంది దిగమింగుకుంటే.. మరికొంతమంది అదుపు చేసుకోలేక.. కంటతడి పెట్టుకున్నారు.

గత నెలన్నర రోజులుగా సంతోషంతో కళకళలాడిన టీమిండియా.. ఆదివారం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. వరల్డ్‌ కప్‌ సాధించలేకపోయామని, కోట్ల మంది అభిమానుల కలను నిజం చేయలేకపోయామనే వారి బాధ వర్ణనాతీతం. ఇంతటి బాధలో ఉన్న టీమిండియా ఆటగాళ్లను ఓదార్చేందుకు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌ కి వెళ్లిపోయారు. అప్పటికే ఓటమి బాధలో ఉన్న వారిలో కాస్త ధైర్యం నింపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. ఈ క్రమంలో మోదీని చూడగానే టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

దీంతో.. షమీని దగ్గరికి తీసుకున్న మోదీ.. అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ టోర్నీలో ఎంతో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమీ.. సూపర్‌ బౌలింగ్‌ తో 24 వికెట్లు పడగొట్టి.. టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌ గా నిలిచాడు. తొలి నాలుగు మ్యాచ్‌ లు ఆడకపోయినా.. ఒక్కసారి జట్టులోకి వచ్చిన తర్వాత తన సత్తా ఏంటో చూపించాడు. ఫైనల్లో షమీ ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. అయితే.. షమీని ప్రధాని మోదీని ఓదారుస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. ఊరుకో షమీ భాయ్‌.. మనకు టైమ్‌ వస్తుంది. ఈ కన్నీళ్లు ఆనందభాష్పాలుగా మారే టైమ్‌ వస్తుంది. నువ్వు మా ఛాంపియన్‌ బౌలర్‌ వి అంటూ షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి ప్రధాని మోదీ షమీని ఓదార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి