iDreamPost

మళ్లీ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ: ఏపి‌ సిఎం జగన్ తో 17న భేటీ

మళ్లీ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ: ఏపి‌ సిఎం జగన్ తో 17న భేటీ

కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన ‌లాక్ డౌన్ సడలింపులు పెరగడంతో దేశం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారత దేశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నరు.

ఈ నెల 16, 17 (మంగళ, బుధ వారాల్లో) తేదీల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు.

16వ తేదీన ఇరవై ఒక్క రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారు.

17వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం అవుతారు.

లాక్ డౌన్ అనంతర పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇతర అంశాలపై ఈ కీలక సమావేశంలో‌ చర్చించనున్నారు.

ఈ సందర్భంలో కరోనా కేసులు విజృంభిస్తున్న రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో తీసుకోవల్సిన చర్యలను, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశాలు చర్చిస్తారు. ప్రస్తుతం దేశానికి కరోనా ఒక సవాలుగా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా కట్టడి చేశాలనే అంశంపై కీలకంగా చర్చించనున్నారు. మరోవైపు లాక్ డౌన్ విధింపులో ఒక ప్రణాళిక లేకుండా…ఏకపక్షంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం, దేశంలో ప్రజల ప్రాణాలు కోల్పోయారు అని ఆరోపణలు చేస్తున్నారు.

తొలిత రాష్ట్రాలతో చర్చించకుండా ప్రధాని మోడీ ఒక్కడే నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు చేతులు దాటిపోయేసరికి భారం, భాద్యత రాష్ట్రాల మీదకు నెట్టేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి