iDreamPost

క‌రోనాకు స‌మాచార హ‌క్కు చ‌ట్టం వ‌ర్తించ‌దా..? పిఎంకేర్స్ ప్రైవేట్ సంస్థా..?

క‌రోనాకు స‌మాచార హ‌క్కు చ‌ట్టం వ‌ర్తించ‌దా..?  పిఎంకేర్స్ ప్రైవేట్ సంస్థా..?

ప్ర‌పంచాన్ని గ‌డ‌గడ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) దేశంలో క‌ల‌రానృత్యం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించారు. అలాగే ప్ర‌జ‌ల నుంచి నిధులు సేక‌రించడానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిఎం కేర్స్‌ను ప్రారంభించారు. మ‌రోవైపు ఇత‌ర దేశాల నుంచి వైద్య ప‌రిక‌రాలు కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటికి సంబంధించిన స‌మాచార ఇచ్చేందుకు కేంద్ర స‌ర్కార్ స‌సేమీరా అంది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు నిరాక‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్జేడి రాజ్యసభ ఎంపి మనోజ్ కుమార్ ఝా తదితర ప్రతిపక్ష నేతలు, మోడీ సర్కార్ వైఖరిపై మండి పడ్డారు.

కరోనా వైద్య ప‌రిక‌రాల ఖర్చు చెప్పలేంః ఆర్టీఐకి కేంద్రం సమాధానం

కరోనా అరికట్టేందుకు వైద్య పరికరాల కొనుగోలుకు ఎంత మొత్తం ఖర్చు పెట్టారో వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని ”సమాచారం” నిర్వచ‌న పరిధిలోకి ఈ అంశం రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముంబాయికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్‌ గల్గాలి ఈ దరఖాస్తు చేశారు. కోవిడ్‌-19 వ్యాప్తిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడానికి కొనుగోలు చేసిన వైద్య పరికరాలు ఎంత ఖర్చు చేశారని ఆయన దరఖాస్తు ద్వారా సమాచారం అడిగారు. ఈ దరఖాస్తును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ప్రజా సమాచార అధికారి వద్ద దాఖలు చేశారు.

ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేసిన 22 రోజుల తరువాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన విషయాలతో సిపిఐఓ వ్యవహరిస్తుందని ఆయనకు సమాధానం వచ్చింది. కనుకు కేంద్ర సమాచార అధికారి సమాచారం ఇవ్వడానికి లేదని తెలిపింది. సిపిఐఓకు సమాచారం అందించడానికి నిర్దిష్ట సమాచారం లేదని పేర్కొంది.

ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 6(3) ప్రకారం సిపిఐఓ వద్ద సమాచారం లేకపోతే, ఆ అధికారి తన సహోద్యోగికి బదిలీ చేయాలి. అతను పిటిషన్‌ అందుకున్న ఐదు రోజుల్లోనే దానిని బదిలీ చేయాలి. కానీ అలా చేయకుండా సమాచారం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు దాఖలు చేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 4లో స్పష్టంగా ఉంది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం దరఖాస్తు చేసుకున్న పౌరుడికి ”సమాచారం” ఇవ్వటం చట్టం పారదర్శకతను తెలుపుతుంది. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిల్స్‌, అభిప్రాయాలు, సలహాలు, ప్రతిక ప్రకటనలు, సర్క్యులర్స్‌, ఉత్వర్వులు, లాగ్‌బుక్స్‌, ఒప్పందాలు, నివేదికలు, పేపర్స్‌, నమోనాలు, మోడల్స్‌, డేటా మెటీరియల్‌, ఏదైనా ప్రైవేట్‌ సంస్థకు సంబంధించిన సమచారంతో సహా అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతుంది.

దీనిపై గల్గాలీ మాట్లాడుతూ సిపిఐఓ వృతి రహితంగా ఉందని అన్నారు. సమాచారం లేదనడం దారుణమని పేర్కొన్నారు. అలా అయితే సమాచారాన్ని తిరస్కరించడానికి 22 రోజులు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. ”ఇది ఆర్టీఐ ద్వారా ఇవ్వబడదు. కానీ అన్ని ఆర్థిక వివరాలను దాని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తద్వారా ఖర్చుల గురించి తెలుసుకోవటానికి ఎవరూ ఆర్టీఐని దాఖలు చేయాల్సిన అవసరం లేదు” అని గల్గాలీ అన్నారు.

పిఎం కేర్స్ ప్ర‌భుత్వ సంస్థ కాదు

ప్రధాన మంత్రి పౌర సహాయ అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన (పిఎం కేర్స్‌) నిధికి సంబంధించిన సమాచారం ఇవ్వలేమని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) పేర్కొంది. పిఎం కేర్స్‌ ఫండ్‌ ఏర్పాటు, నిర్వహణ గురించి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రకారం దరఖాస్తుదారునికి సమాచారం అడిగేందుకు పిఎం కేర్స్‌ ప్రభుత్వ అధీకృతమైనది (నాట్‌ ఏ పబ్లిక్‌ అథారటీ) కాదని పేర్కొంది. అది ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని తెలిపింది. పిఎం కేర్స్ నిధి ప్ర‌భుత్వ సంస్థ కాక‌పోతే… ప్రైవేట్ సంస్థా అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో విరాళాలను స్వీకరించేందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిఎం కేర్స్‌ను ప్రారంభించారు. మార్చి 28న ప్రధాని మోడీ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ నిధిని ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత ఏప్రిల్‌ 1న బెంగళూర్‌లోని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన‌ న్యాయ విద్యార్థి హర్ష కందుకూరి ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు.

ఫండ్‌ ట్రస్ట్‌, పిఎం కేర్స్‌ ఏర్పాటుకు, దాని కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లను అందించాలని పిఎంఒను కోరారు. ”ఇప్పటికే ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) ఉన్నప్పుడు, మరొక నిధి అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. పిఎం కేర్స్‌ ట్రస్ట్‌, దాని లక్ష్యాల గురించి నాకు ఆసక్తి ఉంది. నేను ట్రస్ట్‌ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను” అని హర్ష కందుకూరి అందులో పేర్కొన్నారు.

ఆయన ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేసిన 30 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మళ్లీ విజ్ఞప్తి చేశాడు. దీంతో మే 29న పిఎంఒ సమాచార అధికారి నుండి హర్ష కందుకూరి సమాధానం వచ్చింది. ”ఆర్టీఐ చట్టం-2005లోని సెక్షన్‌ 2(హెచ్‌) పరిధిలో పిఎం కేర్స్‌ నిధి పబ్లిక్‌ అథారిటీ కాదు. అయితే పిఎం కేర్స్‌ నిధికు సంబంధించిన సమాచారం వెబ్‌సైట్‌ పిఎంకేర్స్‌. జిఒవి.ఇన్‌లో చూడవచ్చు” అని సమాధానం ఇచ్చింది. దీంతో హర్ష కందుకూరి ఇప్పుడు ”ట్రస్ట్‌ పేరు, ట్రస్ట్‌ ఏర్పాటు, కంట్రోల్‌, చిహ్నం, ప్రభుత్వ డొమైన్‌ పేరు, ఇలా ప్రతిదీ ప్రజా అధికారం సూచిస్తుంది” అని ఆర్టీఐ దరఖాస్తు చేయనున్నారు.

హర్ష కందుకూరి మాట్లాడుతూ ఈ ట్రస్ట్‌కు ప్రధాన మంత్రి ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌. ముగ్గురు క్యాబినేట్‌ మంత్రులు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. దీన్ని బట్టీ ట్రస్ట్‌పై ప్రభుత్వం నియంత్రణ గణనీయంగా ఉంటుందని, ఇది ప్రజా అధికారం అవుతుందని అన్నారు. ఆర్టీఐ కార్యకర్త విక్రాంత్‌ తోగాడ్‌ దాఖలు చేసిన మరో ఆర్టీఐ దరఖాస్తును కూడా ఏప్రిల్‌లో తిరస్కరణకు గురైంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి