iDreamPost

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రణీత్‌ రావు ఫోకస్‌ అంతా రేవంత్‌పైనే! వాట్సాప్‌ చాట్‌ వైరల్!

  • Published Mar 15, 2024 | 11:58 AMUpdated Mar 15, 2024 | 1:09 PM

Phone Tapping Case: ఫోన్‌ టాపింగ్‌ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమలో ప్రణీత్‌ రావు వాట్సాప్‌ చాట్‌ బయటకు వచ్చింది. దీనిలో సంచలన విషయాలు తెలిశాయి. ఆ వివరాలు..

Phone Tapping Case: ఫోన్‌ టాపింగ్‌ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమలో ప్రణీత్‌ రావు వాట్సాప్‌ చాట్‌ బయటకు వచ్చింది. దీనిలో సంచలన విషయాలు తెలిశాయి. ఆ వివరాలు..

  • Published Mar 15, 2024 | 11:58 AMUpdated Mar 15, 2024 | 1:09 PM
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రణీత్‌ రావు ఫోకస్‌ అంతా  రేవంత్‌పైనే! వాట్సాప్‌ చాట్‌ వైరల్!

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో.. రాష్ట్ర నిఘా విభాగంలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన ప్రణీత్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడు. ఈ కేసులో ఇతడే కీలక నిందితుడుగా ఉన్నాడు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.. ప్రణీత్‌ రావు.. ప్రతిపక్ష నేతలు, కీలక అధికారులు, వారి బంధువుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లుగా ఆధారాలు లభించాయి. దాంతో ప్రణీత్‌ రావును అరెస్ట్‌ చేసి.. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రణీత్‌ రావు వాట్పాప్‌ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ బయటకు వచ్చాయి.

వీటిల్లో ఉన్న దాని ప్రకారం.. ప్రణీత్‌ రావు ఫోకస్‌ అంతా సీఎం రేవంత్‌ రెడ్డిపైనే అని అర్థం అవుతోంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్‌ను ఎవరు కలుస్తున్నారు.. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై ప్రణీత్‌ రావు ఎక్కువగా ఫోకస్‌ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేత ఆదేశాల మేరకే ప్రణీత్‌ రావు.. రేవంత్‌ రెడ్డిపైన ఫోకస్‌ చేసి.. ట్యాపింగ్‌కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డిని ఎవరు.. ఎక్కడ కలుస్తున్నారు అనే సమాచారంతో పాటుగా.. డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్‌మేషన్‌ని కూడా ప్రణీత్‌ ఎప్పటికప్పుడు సదరు టీఆర్‌ఎస్‌ నేతకు చేరవేశాడు.

రేవంత​ రెడ్డి మీద మాత్రమే కాక… ఆయన అనుచరులు, చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్‌ చేశాడు ప్రణీత్‌. అలానే రేవంత్‌ రెడ్డి సోదరులు ఫోన్‌ నంబర్లను కూడా ట్యాప్‌ చేశారు. కొంతమంది మీడియా పెద్దలను కూడా వదల్లేదు ప్రణీత్‌ రావు. ఈ క్రమంలో పోలీసులు అతడి వాట్సాప్‌ చాటింగ్‌లను రిట్రీవ్‌ చేస్తున్నారు. ఈ ఫోన్‌ చాట్‌ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆ ముఖ్యనేత సుమారు 100 ఫోన్‌ నంబర్లు ప్రణీత్‌ రావుకు ఇచ్చాడని.. ఆయా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ ముఖ్య టీఆర్‌ఎస్‌ నేత ఎవరు.. అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్‌ రావు ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్‌ చేశాడు.. ముఖ్యనేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రణీత్‌ రావును తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి