iDreamPost

విడుదలకు ముందే 60కి పైగా అవార్డులు.. థియేటర్లలోకి వచ్చేస్తోంది..

Narudi Batuku Natana Movie Glimpse: మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడతారు. అలాంటి ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Narudi Batuku Natana Movie Glimpse: మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడతారు. అలాంటి ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విడుదలకు ముందే 60కి పైగా అవార్డులు.. థియేటర్లలోకి వచ్చేస్తోంది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది ఒక సెంటిమెంట్. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే దానికి బ్రహ్మరథం పడతారు. నటించింది చిన్నవాళ్లా? పెద్దవాళ్లా? డైరెక్టర్ కొత్తోడా.. పాతోడా? ఇలాంటి బేధాభిప్రాయాలు చూపించరు. కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి ఒక సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కూడా కాకుండా కంటెంట్ ఉన్న సినిమా అని ఎలా చెప్తున్నారు అనుకోకండి. ఈ మూవీ విడుదలకు ముందే ఏకంగా 60కి పైగా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ మూవీ టీమ్ విడుదల చేసింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకవైపు పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ చేస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. అత్యంత వేగంగా 100 సినిమాలు నిర్మించాలనే లక్ష్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఉన్నారు. ఇప్పుడు వీళ్లు తాజాగా ఓ కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ మూవీ మరేదో కాదు.. ‘నరుడి బతుకు నటన’ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ టైటిల్ గ్లింప్స్ చూశాక సినిమాకి 60కి పైగా అవార్డులు ఎందుకు వచ్చాయో అర్థమవుతుంది. ఈ మూవీలో శివకుమార్, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైరా రాఘవ లీడ్ రోల్స్ ప్లే చేశారు.

ఈ నరుడి బతుకు నటన మూవీ మొత్తం శివకుమార్, నితిన్ ప్రసన్న జీవితాల నేపథ్యంలో నడుస్తున్నట్లు చూపించారు. ఇద్దరినీ మంచి ఫ్రెండ్స్ లా చూపించారు. కానీ వాళ్లే శత్రువులు అయినట్లు కూడా కనిపిస్తోంది. ఇద్దరిలో శివకుమార్ తెలుగు కుర్రాడు కాగా.. నితిన్ ప్రసన్న మాత్రం మలయాళీ కుర్రాడుగా చూపించారు. నిజానికి నితిన్ ప్రసన్న మలయాళీ నటుడే. ఇటీవల అతనికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు. తెలుగు కూడా అద్భుతంగా మాట్లాడతాడు. సుహాస్ తో ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే శివకుమార్ కు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు లీడ్ రోల్స్ సినిమా అనగానే అంచనాలు వచ్చేశాయి.

ఈ ఇద్దరు యాక్టర్స్ లో శివకుమార్ కు నటుడు కావాలి అనేది కోరిక. కానీ, ప్రతిసారి అవమానమే ఎదురవుతూ ఉంటుంది. ఇలా భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ మూవీకి 12వ దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. అంతేకాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ కూడా చేశాడు. మొత్తంగా 60కి పైగా అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి.. నరుడి బతుకు నటన టైటిల్ గ్లింప్స్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి