iDreamPost
android-app
ios-app

ఆసియా కప్‌ వల్ల భారీగా నష్టపోతున్నాం.. పరిహారం కావాలి!

  • Published Sep 07, 2023 | 1:29 PMUpdated Sep 07, 2023 | 1:29 PM
  • Published Sep 07, 2023 | 1:29 PMUpdated Sep 07, 2023 | 1:29 PM
ఆసియా కప్‌ వల్ల భారీగా నష్టపోతున్నాం.. పరిహారం కావాలి!

మినీ వరల్డ్‌ కప్‌గా భావించే ఆసియా కప్‌ రెండో దశకు చేరుకుంది. గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బీ నుంచి రెండేసి జట్లు సూపర్‌ 4కు చేరుకున్నాయి. సూపర్‌ 4లో భాగంగా పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒక మ్యాచ్‌ కూడా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. 10న ఇండియా-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ దాయాదుల మధ్య లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో ఇకే ఇన్నింగ్స్‌ కావడం, వర్షంతో మ్యాచ్‌ రద్దు కావడంతో క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందారు. 10వ తేదీన జరిగే మ్యాచ్‌ కోసం అదే రేంజ్‌ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఈ ఆసియా కప్‌ టోర్నీతో తమకు తీవ్ర నష్టం వటిల్లుతోందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు గోలపెడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీసీ(ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌)ను నష్టపరిహారం కోరేందుకు పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌ 2023 టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ, టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో.. ఏసీసీ ఆసియా కప్‌ టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు నిర్ణయించింది.

దీంతో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా సూపర్‌ 4కు చేరడంతో ఇక నుంచి జరిగే మ్యాచ్‌లన్నీ లంకలోనే జరగనున్నాయి. అయితే శ్రీలంకలో వర్షాల కారణంగా మ్యాచ్‌లు జరిగా జరడం లేదు. భారీ క్రేజ్‌ ఉన్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మధ్యలోనే వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అలాగే ఇండియా-నేపాల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. ఇలా వర్షం వల్ల మ్యాచ్‌లు సరిగా జరగకపోవడంతో టోర్నీ నిర్వహిస్తున్న తమకు నష్టం వస్తుందని, శ్రీలంకలో కాకుండా యూఏఈని మరో వేదికగా ఎంచుకోవాలని ఏసీసీకి చెప్పినా వినలేదని పీసీబీ పెద్దలు వాపోతున్నారు. అందుకే తమకు నష్టపరిహారం కావాలని ఏసీసీ కోరనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ టికెట్ల విషయంలో BCCI గుడ్‌న్యూస్‌! లక్షల్లో టికెట్లు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి