iDreamPost

భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీబీ చీఫ్.. గొడవ తప్పదా?

  • Author singhj Published - 02:40 PM, Fri - 29 September 23
  • Author singhj Published - 02:40 PM, Fri - 29 September 23
భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీబీ చీఫ్.. గొడవ తప్పదా?

వన్డే వరల్డ్ కప్-2023 సందడి మొదలైంది. ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఒక్కో దేశం భారత్​కు చేరుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్​ టీమ్​ హైదరాబాద్​లో దిగిపోయింది. దాయాది జట్టుకు శంషాబాద్ ఎయిర్​పోర్టులో అదిరిపోయే రీతిలో స్వాగతం లభించింది. పాక్ టీమ్​ను చూసేందుకు వందలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. వెల్​కమ్​ టు ఇండియా అంటూ స్వాగతం పలికారు. దీంతో బాబర్ సేన సంతోషంలో మునిగిపోయింది. ఇక, హోటల్​లో అయితే పాక్ క్రికెటర్లకు కండువాలు కప్పి, పన్నీరు చల్లి స్వాగతం చెప్పారు. తమకు ఇంత అద్భుతంగా వెల్​కమ్ చెప్పడం, ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించడంతో ఆ దేశ ప్లేయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు పాక్ క్రికెటర్లకు భారత్​లో సకల మర్యాదలతో ఘనస్వాగతం లభించగా.. మరోవైపు ఆ దేశ క్రికెట్ బోర్డు మాత్రం తన చెత్త బుద్ధిని మరోమారు చూపెట్టింది. పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు (పీసీబీ) చీఫ్ జాకా అష్రాఫ్ భారత్​పై మరోమారు విషం కక్కాడు. వరల్డ్ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జాకా అష్రాఫ్ మాట్లాడుతూ.. పాక్ జట్టు చాలా ధైర్యంగా ఉండాలని, శత్రుదేశంలో అయినా ఇంకెక్కడైనా సరే.. టోర్నీ జరుగుతుంటే దేశం మొత్తం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ షాకవుతున్నారు.

పాకిస్థాన్ జట్టును ఇంత బాగా చూసుకుంటూ భారతీయులు గ్రాండ్ వెల్​కమ్ చెబుతుంటే.. మరోవైపు పీసీబీ చీఫ్​ అష్రాఫ్​ మాత్రం భారత్​ను శత్రుదేశం అంటున్నారని ఫైర్ అవుతున్నారు. పాక్ చెత్త బుద్ధి ఇలాగే ఉంటుందని సీరియస్ అవుతున్నారు. దీనిపై ఇతర దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. పీసీబీ చీఫ్ హోదాలో ఉండి వరల్డ్ కప్ జరుగుతున్న వేళ భారత్​ను ఇలా శత్రుదేశంగా అభివర్ణించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ కాంట్రవర్సీ ఇక్కడితో ముగియదని.. ఇది పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అనుకోకుండా కాదు.. పక్కా ప్లానింగ్​తోనే అశ్విన్ ఎంట్రీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి