iDreamPost

అనుకోకుండా కాదు.. పక్కా ప్లానింగ్​తోనే! అశ్విన్ ఎంట్రీ వెనుక వ్యూహం!

  • Author singhj Published - 12:30 PM, Fri - 29 September 23
  • Author singhj Published - 12:30 PM, Fri - 29 September 23
అనుకోకుండా కాదు.. పక్కా ప్లానింగ్​తోనే! అశ్విన్ ఎంట్రీ వెనుక వ్యూహం!

సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు టైమ్ బాగా కలిసొస్తోంది. వన్డేలకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఈ క్రికెటర్.. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్​లో చోటు దక్కించుకున్నాడు. ఆ సిరీస్​లో రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​లపై కంగారూ బ్యాట్స్​మెన్​ను స్పిన్​ వేరియేషన్స్​తో ఆటాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వన్డే వరల్డ్ కప్​ టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు వారాలకు ముందు వరకు వన్డే టీమ్ ఛాయల్లోనే లేని స్టార్ స్పిన్నర్.. మరో వారం రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్​లో టీమిండియా స్పిన్ ఎటాక్​ను లీడ్ చేయనున్నాడు. ఆసియా కప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్​కు దూరమయ్యాడు.

ఆల్​రౌండర్ అక్షర్ గాయం అశ్విన్​కు వరంగా మారింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అక్షర్ ప్లేసులో వరల్డ్ కప్​ టీమ్​లోకి అశ్విన్​కు ఛాన్స్ ఇచ్చింది. ఈ సెలెక్షన్​కు ఐసీసీ ఓకే చెప్పింది. అశ్విన్ ఎంట్రీతో భారత స్పిన్ ఎటాక్​ మరింత వైవిధ్యంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్​కు ఎంపికైన జడేజా, అక్షర్, కుల్​దీప్​లు లెఫ్టాండర్ స్పిన్నర్లు అనేది తెలిసిందే. ఇప్పుడు అక్షర్ స్థానంలో అశ్విన్ రావడంతో స్పిన్ దాడికి వైవిధ్యం వచ్చింది. జడేజా ట్రెడిషనల్ లెఫ్టాండ్ స్పిన్, కుల్​దీప్ చైనామన్ శైలి, అశ్విన్ ఆఫ్ స్పిన్​ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్​మన్​కైనా కష్టమనే చెప్పాలి. వరల్డ్ కప్ టీమ్​లోకి అశ్విన్ అనుకోకుండా వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే అశ్విన్ సెలెక్షన్ వెనుక టీమ్ మేనేజ్​మెంట్ వ్యూహం కనిపిస్తోంది.

ఆసియా కప్, ప్రపంచ కప్ స్క్వాడ్ ప్రకటించిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకే మాట చెబుతూ వచ్చారు. పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే అశ్విన్ లేదా యుజ్వేంద్ర చాహల్​ను తీసుకుంటామని పలుమార్లు చెప్పారు. భారత పిచ్​లపై ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరు స్పిన్నర్లు కీలకమని భావించారేమో. వీళ్లతో తాము నిరంతరం మాట్లాడుతున్నామని రోహిత్, ద్రవిడ్ తెలిపారు. ఇప్పుడు అక్షర్ ప్లేసులో అశ్విన్​ను సెలెక్ట్ చేశారు. చాహల్​కు బదులు అశ్విన్​ను సెలెక్ట్ చేయడానికి అతడికి ఉన్న బ్యాటింగ్ ఎబిలిటీ ఒక కారణమని చెప్పొచ్చు. వరల్డ్ కప్​ టీమ్​లోకి సెలెక్షన్ విషయంలో అశ్విన్​కు భారత టీమ్ మేనేజ్​మెంట్ ముందే హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)లో అశ్విన్ చాన్నాళ్లు ప్రాక్టీస్ చేయడమే.

వరల్డ్ కప్​కు ముందు ప్రకటించిన టీమ్​లో లేని అశ్విన్ ఎన్​ఏసీలో​ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో టెస్టులు కూడా లేవు. అలాంటప్పుడు అతడు అక్కడ ఎందుకున్నట్లు? ఎన్​ఏసీలో ఉండి అక్కడి కోచ్ సాయిరాజ్ బహుతలే శిక్షణలో తన బౌలింగ్​ను మరింత మెరుగుపర్చుకున్నానని ఆసీస్​తో వన్డే మ్యాచ్ తర్వాత స్వయంగా అశ్విన్​ చెప్పాడు. ఎన్​సీఏలో బౌలింగ్​ మెరుగువ్వడంతో పాటు ఫిజికల్​గానూ ఫిట్ అయ్యాడు అశ్విన్. సో, ఆసీస్​ సిరీస్​కు ముందే ఎన్​సీఏలో ఈ సీనియర్ స్పిన్నర్​ను ద్రవిడ్, రోహిత్ సిద్ధం చేశారన్న మాట. పక్కా ప్లానింగ్ ప్రకారమే అతడ్ని కంగారూ సిరీస్​లో ఆడించినట్లుగా కనిపిస్తోంది. ఆ సిరీస్​లో రాణించడం, అదే టైమ్​లో అక్షర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అశ్విన్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. పరిస్థితులు చూస్తుంటే.. ఒకవేళ అక్షర్ ఫిట్​గా ఉన్నా అశ్విన్​ను టీమ్​లోకి తీసుకునేవారని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. వరల్డ్ కప్ టీమ్​లోకి అశ్విన్​ ఎంట్రీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్థాన్ నెట్ బౌలర్​గా హైదరాబాదీ కుర్రాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి