iDreamPost

సొంత ఫ్యాన్స్ ని తిడుతూ.. టీడీపీ వర్ధిల్లాలి అట.. పవన్ ఇదేమి దౌర్భాగ్యం?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేనా అధినేత పవన్ కళ్యాన్ తీరు ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి అండగా ఉన్న ఫ్యాన్స్ ను తిడుతూ.. టీడీపీకి జై కొడుతున్న పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేనా అధినేత పవన్ కళ్యాన్ తీరు ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి అండగా ఉన్న ఫ్యాన్స్ ను తిడుతూ.. టీడీపీకి జై కొడుతున్న పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత ఫ్యాన్స్ ని తిడుతూ.. టీడీపీ వర్ధిల్లాలి అట.. పవన్ ఇదేమి దౌర్భాగ్యం?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రతిపక్షాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కూడా ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో జనసైనికులు భగ్గుమన్నారు. పవన్ పై తీవ్ర వ్యతిరేఖత కనబరుస్తూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసారు. మీపై మాకు ఉన్న నమ్మకం మీ పై మీకు లేకపాయే అన్న అంటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఇక ఈ వ్యవహారంపై దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను దూశిస్తూ టీడీపీకి జై కొట్టడం మరింత కాక రేపుతోంది.

త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేనా ఒంటరిగానే పోటీచేయబోతుందని జనసైనికులు భావించారు. తమకు పోటీచేసే అవకాశం వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా ఇటు ఫ్యాన్స్, అటు కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లుతూ పవన్ చంద్రబాబుతో పొత్తుకు జై కొట్టారు. పొత్తులో భాగంగానైనా జనసేన పార్టీ ప్రతిష్ట దిగజారకుండా సీట్లు దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీన్ని జీర్ణించుకోలేని ఫ్యాన్స్, నాయకులు నిరసనలకు దిగారు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లు జనసేనకు అండగా నిలిచిన ఫ్యాన్స్ ను మీరు నాకు అవసరం లేదంటూ పవన్ కళ్యాన్ మాట్లాడుతున్నారు. ఆయన తీరును చూస్తుంటే పవన్ నీకు ఇదేమీ దౌర్భాగ్యం అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న టీడీపీ-జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను 24 సీట్లు తీసుకుంటే కొందరు విమర్శిస్తున్నారన్నారు. జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్లు అవసరం లేదని.. పార్టీ గెలుపు కోసం పోరాడే వాళ్లు కావాలని అన్నారు. తనతో నడిచే వాళ్లే తన వాళ్లని, నిజంగా జనసేనకు మద్దతుదారులైతే తనను ప్రశ్నించొద్దని ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ పవన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు నీపై నమ్మకం పెట్టుకున్నందుకు మాకు తగిన బుద్ది చెప్పావంటూ.. మా పవర్ ఏంటో చూపిస్తామంటూ సవాల్ విసురుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి