iDreamPost

కొడాలి నానికి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్‌

  • Published Oct 25, 2023 | 3:30 PMUpdated Oct 25, 2023 | 3:30 PM

పవన్‌ కళ్యాణ్‌-కొడాలి ఇద్దరూ నవ్వుతూ ఒకరికి ఒకరు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం అంటే వింతే. మరి ఈ ఆసక్తికర సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

పవన్‌ కళ్యాణ్‌-కొడాలి ఇద్దరూ నవ్వుతూ ఒకరికి ఒకరు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం అంటే వింతే. మరి ఈ ఆసక్తికర సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

  • Published Oct 25, 2023 | 3:30 PMUpdated Oct 25, 2023 | 3:30 PM
కొడాలి నానికి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్‌

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పేర్లు వినిపించగానే వారిద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం మాత్రమే జనాలకు గుర్తు వస్తుంది. అయితే ఈ క్రమంలో తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలు ఒకరికి ఒకరు నమస్కారం చేసుకోవడం మాత్రమే కాక.. స్నేహపూర్వకంగా షేక్‌ హ్యాండ్‌ కూడా ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్‌ వినిస్తున్నాయి. మరి ఇంతకు ఈ ఆసక్తికర సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుంది.. ఏంటి అంటే..

రెండు రోజుల క్రితం టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల నేతలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీనిలో భాగంగానే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటుగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా వంగవీటి రాధ వివాహానికి హాజరయ్యారు.

ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌.. వంగవీటి రాధకు అభినందనలు చెప్పడానికి వెళ్లిన సమయంలో కొడాలి నాని అక్కడే ఉన్నారు. దాంతో ఆయన పవన్‌కి నమస్కారం చేశాడు. అందుకు ప్రతీగా జనసేన అధ్యక్షుడు కూడా నవ్వుతూ కొడాలి నానికి ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి