iDreamPost

పవన్‌ను వెంటాడుతున్న బర్రెలక్క! ఇదేమి శాపం?

Pawan, Barrelakka: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి బర్రెలక్క అలియాస్ శిరీష్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..భారీగానే ఓట్లు సంపాదించారు. ఈ పోటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి శాపంగా మారిందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఎందుకంటే..

Pawan, Barrelakka: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి బర్రెలక్క అలియాస్ శిరీష్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..భారీగానే ఓట్లు సంపాదించారు. ఈ పోటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి శాపంగా మారిందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఎందుకంటే..

పవన్‌ను వెంటాడుతున్న బర్రెలక్క! ఇదేమి శాపం?

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల తరువాత ఒక సామాన్యురాలి  సత్తా..  స్టార్ సెలబ్రిటీకి  ముప్పుగా మారింది. అసెంబ్లీ ఎన్నికలలో చివరి నిమిషంలో పోటీ చేసి అందరి దృష్టిలో పడింది బర్రెలక్క(శిరీష). అలాగే, బీజేపీతో పొత్తుపెట్టుకుని..  తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే, జనసేన పోటీ చేసిన 8 స్థానాలకు గాను.. కూకట్ పల్లిలో తప్ప మరెక్కడా కూడా కనీసం చెప్పుకోదగిన ఓట్లు రాలేదు. కానీ, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు 5వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దీనితో, అప్పటినుంచి జనసేన అధినేత.. ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యాడు. ప్రతి ఒక్కరు పవన్ ను బర్రెలక్కతో పోలుస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ రకంగా ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ ను బర్రెలక్క రాజకీయంగా వెంటాడుతోంది.

తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క.. ఇపుడు ఏపీ పాలిటిక్స్ లోను హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జనసేనకు వారి ప్రత్యర్థులకు బర్రెలక్క ప్రధాన అంశంగా నిలిచింది. జనసేన  అభ్యర్థులకు ప్రత్యర్థులకు మధ్య సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ నడుస్తోంది.  ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క తెగువ అందరిని ఆకట్టుకుంది. కానీ, పవనుడి జెండా మాత్రం పరువు పోగొట్టుకుంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనిని జనసేన  ఏ మాత్రం జీర్ణించుకోలేక.. ఇటు తిప్పికొట్టలేక మౌనంగా ఉండిపోయింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం  పవన్ కంటే బర్రెలక్క బెటర్ అంటూ కామెంట్ చేశాడు. ఇక తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పవన్ ను బర్రెలక్కతో పోల్చుతూ..  ఓ సభలో వీరిద్దరి ప్రస్తావన తీసుకుని వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా  జనసేన పార్టీ అభ్యర్థులకు పడలేదు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్.. బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయాడని, పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

పైసా ఖర్చు లేకుండా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినా.. బర్రెలక్క ఆమాత్రం ఓట్లు సంపాదించడం గొప్ప విషయమే. అయితే, అదే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఏపీ రాజకీయాల్లో శాపంగా మారింది. ఇటు ఏపీలోను జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెల్సిందే. అయితే, తెలంగాణాలో పవన్ కు వచ్చిన ఓట్లను దృష్టిలో ఉంచుకుని.. ఏపీలో జనసేన సీట్లు తగ్గించవచ్చేమో అనే టాక్ వినిపిస్తోంది.

ఒక పెద్ద హీరోగా పవన్ కు ఉన్న ఇమేజ్..  తెలంగాణ ఎన్నికలలో  ఏ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదని ఆ ఎన్నికల ద్వారా స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా, నిరుద్యోగుల ఉపాధి కోసం ఒక ఆశయంతో బరిలోకి దిగిన బర్రెలక్క.. ఓడినా గెలిచినట్లే అన్నట్లు, స్టార్ హీరోను విమర్శించడానికి ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది. కాగా,  ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి బర్రెలక్క శాపంగా మారిందా అనే చర్చలు మొదలయ్యాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి