iDreamPost

పవన్ .. ట్విట్టర్ పులేనా ?

పవన్ .. ట్విట్టర్ పులేనా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాలి తీసేశాడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో. కరోనా వైరస్ నేపధ్యంలో జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందంటూ పవన్ ప్రకటించాడు లేండి. అదే విషయమై విజయసాయి మాట్లాడుతూ ’రాజకీయాలు చేయటానికి నీకసలు గ్రౌండే లేదుకదా పవను’ అంటు గాలి తీసేశాడు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ’నేను లేస్తే మనిషిని కాను’ అని చిటికలేసినట్లుగా ఉంది నీ వాలకం అంటూ ఎద్దేవా చేశాడు. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలాగంటూ నిలదీశాడు.

విజయసాయి అన్నాడని కాదుకానీ మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటి చేసిన సుమారు 149 సీట్లలో వచ్చిన ఓట్ల శాతం సుమారు 3.6. రెండు చోట్ల పోటి చేసిన అధినేత పవన్ కల్యాణే ఓడిపోయాడు. భీమవరంలో నామినేషన్ వేసినపుడు గెలుపు గ్యారెంటీ అన్నారు. తర్వాత గాజువాకలో నామినేషన్ వేసినపుడు కూడా ఇక్కడ గెలుసు ఖాయమన్నారు. తీరా చూస్తే రెండు చోట్లా ఓడిపోయాడు. కాస్తలో కాస్త నయం ఏమిటంటే రెండు చోట్లా ఓట్లు మాత్రం గట్టిగానే పడ్డాయిలేండి.

పవన్ మినహా జనసేన తరపున పోటి చేసిన మిగిలిన వారిలో చాలామందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. నర్సాపురం ఎంపిగా పోటి చేసిన పవన్ సోదరుడు నాగుబాబు కూడా ఘోరంగా ఓడిపోయాడు. ఎన్నికలకు ముందు జనసేన అంతన్నారు ఇంతన్నారు. తీరా చూస్తే మొత్తం డొల్లనే తేలిపోయింది. చివరకు పార్టీ మొత్తం మీద గెలిచింది రాజోలులో రాపాక వరప్రసాద్ మాత్రమే. రాపాక కూడా పార్టీ అభ్యర్ధిగా గెలవలేదని తేలిపోయింది.

ఎందుకంటే రాపాకకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. కాంగ్రెస్ తరపున మొదటిసారి గెలిచాడు కాబట్టే కాస్త క్రేజ్ ఉంది. పైగా ఎన్నికలకు ముందు వరకు రాపాక వైసిపి నేతన్న విషయం గుర్తుంచుకోవాలి. వైసిపి తరపున టికెట్ రాదని తెలిసిన తర్వాతే జనసేనలో చేరి పోటి చేశాడు. మొత్తం మీద మొన్నటి ఎన్నికల తర్వాత అందరికీ అర్ధమైందేమంటే పవన్ కల్యాణ్ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్ గా ఉంటాడని. ట్విటర్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగులిచ్చేస్తుంటాడు. అందుకనే విజయసాయి జనసేనాధిపతిని ఎద్దేవా చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి