iDreamPost
android-app
ios-app

పతిరాణా ధోని కాళ్లు మొక్కలేదు.. అంతా ఫేక్‌! బయటికొచ్చిన రియల్‌ వీడియో

  • Published Mar 30, 2024 | 10:58 AM Updated Updated Mar 30, 2024 | 4:29 PM

Matheesha Pathirana, MS Dhoni: చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక ఆటగాడు పతిరానా ధోని కాళ్లు మొక్కాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు అతను ధోని కాళ్లు మొక్కనేలేదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Matheesha Pathirana, MS Dhoni: చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక ఆటగాడు పతిరానా ధోని కాళ్లు మొక్కాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు అతను ధోని కాళ్లు మొక్కనేలేదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 30, 2024 | 10:58 AMUpdated Mar 30, 2024 | 4:29 PM
పతిరాణా ధోని కాళ్లు మొక్కలేదు.. అంతా ఫేక్‌! బయటికొచ్చిన రియల్‌ వీడియో

దిగ్గజ క్రికెటర్‌ ధోనికి కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా కూడా ధోని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్‌ ధోనిని అభిమానిస్తుంటారు. ఫ్యాన్స్‌ కొన్ని సందర్భాల్లో ధోని కాళ్లు మొక్కి తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. అయితే.. ధోనికి కేవలం సాధారణ ప్రేక్షకుల్లోనే కాదు.. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఆరాధ్య క్రికెటర్‌గా, అభిమాన ఆటగాడిగా ధోనిని అభిమానిస్తారు. అలాంటి వారిలో శ్రీలంక క్రికెటర్‌ మతీష పతిరాణా కూడా ఒకరంటూ.. తన అభిమానాన్ని చూపిస్తూ.. ధోని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడంటూ రెండు రోజులుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స​, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మంగళవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఆ సంఘటనకు సంబంధించిన వీడియో చూసి.. చాలా మంది పతిరాణా, ధోని కాళ్లు మొక్కి, దీవెనలు తీసుకున్నాడు అంటూ పేర్కొంటున్నారు.

కానీ, అదంతా ఫేక్‌ అని నిర్ధారణ అయింది. నిజానికి ఆ వీడియోలో పతిరాణా, ధోని కాళ్లు మొక్కుతున్నట్లు కనిపించింది కానీ, అది నిజం కాదు. జస్ట్‌ కెమెరా యాంగిల్‌ వల్ల జరిగిన పొరపాటు అది. తాజాగా ఆ సంఘటనకు సంబంధించిన రియల్‌ వీడియో ఒకటి బయటికి వచ్చింది. పతిరాణా, ధోని కాళ్లు మొక్కుతున్నట్లు కనిపిస్తున్న ఆ ఘటనను వేరే కెమెరా యాంగిల్‌లో చూస్తే.. అసలు విషయం అర్థమైంది. అసలు అక్కడ ధోని కాళ్లు అతను మొక్కనే లేదు సరికదా.. కనీసం ధోనికి దగ్గరగా కూడా లేడు.

ధోనికి తనకి మధ్య ఏదో బౌలర్లు తమ లెంత్‌ కోసం పెట్టుకునే ఒక వైట్‌ రౌండ్‌ మార్కర్‌ను పతిరాణా అక్కడి నుంచి తీసి పక్కకు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో కెమెరా యాంగిల్‌.. అంతే పతిరాణా వైపు నుంచి చూస్తే.. అతను ధోని కాళ్లు మొక్కుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, వారి వెనుక కెమెరా యాంగిల్‌ నుంచి చూస్తే.. క్లియర్‌గా వారిద్దరి మధ్య చాలా గ్యాప్‌ ఉండటం, పతిరాణా.. అక్కడున్న మార్కర్‌ను తీసి పక్కకు వేయడం చూడొచ్చు. ఈ వీడియోతో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక ఫేక్‌ వీడియో, పతిరాణా ధోని కాళ్లు మొక్కాడంటూ ఒక ఫేక్‌ ప్రచారం జరుగుతున్న విషయం బట్టబయలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.