iDreamPost
android-app
ios-app

ప్రవీణ్ తో బ్రేకప్? తాను నెగిటివ్ అవుతున్నానంటూ ఫైమా ఆవేదన!

  • Published May 06, 2024 | 4:07 PM Updated Updated May 06, 2024 | 4:07 PM

Patas Faima On Breaking Up With Praveen: పటాస్ షోతో ఫైమాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ వంటి షోస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. ఫైమా తొలిసారి ప్రవీణ్ తో బ్రేకప్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.

Patas Faima On Breaking Up With Praveen: పటాస్ షోతో ఫైమాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ వంటి షోస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. ఫైమా తొలిసారి ప్రవీణ్ తో బ్రేకప్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Published May 06, 2024 | 4:07 PMUpdated May 06, 2024 | 4:07 PM
ప్రవీణ్ తో బ్రేకప్? తాను నెగిటివ్ అవుతున్నానంటూ ఫైమా ఆవేదన!

బుల్లితెర మీద మీరు ఎన్నో జంటలను చూసుంటారు. పలు కామెడీ షోస్, డాన్స్ షోస్ లో ఈ జంటలు సందడి చేస్తుంటాయి. అలాగే వారి యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి బుల్లితెర జంటల్లో పటాస్ ఫైమా- ప్రవీణ్ జంట కూడా ఒకటి. అయితే వాళ్ల మధ్య ఇప్పుడు మాటలు లేవు. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటూ ఫైమా చెప్పుకొచ్చింది. అలాగే అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? వాళ్లు నిజంగానే విడిపోయారా? విడిపోవడం కంటే ముందు.. అసలు వాళ్లిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా? అనే అన్ని విషయాలను ఫైమా రివీల్ చేసింది.

పటాస్ ఫైమా అనగానే కచ్చితంగా ప్రవీణ్ పేరు కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్లిద్దరు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్లు జంటగానే వీడియోలు చేశారు. అలాగే గిఫ్టులు ఇచ్చుకోవడం, ఎంతో కేరింగ్ గా ఉండటం చేశారు. ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్లు చేసిన ఆ వీడియోలు చూసి వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు అంతా అనుకున్నారు. వాళ్లు కూడా ఆ విషయాన్ని ఖండించకుండా కంటిన్యూ చేశారు. కానీ, గత కొన్ని రోజులుగా వాళ్ల మధ్య మటాలు లేవు. వాళ్లిద్దరు విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అలాగే ప్రవీణ్ కూడా ఫైమా తన ప్రేమను రిజెక్ట్ చేసింది అంటూ వెల్లడించారు. ఇప్పుడు ఫైమా కూడా వారి మధ్య జరిగిన విషయాలను చెప్పుకొచ్చింది.

Faima

“ఆన్ స్క్రీన్ లో మీకు కనిపించే ఏ జోడీ కూడా నిజం కాదు. ఆన్ స్క్రీన్ మీద మమ్మల్ని జోడీగా చూపించారు. మమ్మల్ని ఆడియన్స్ ఆదరించారు. ఆ క్రేజ్ ని వాడుకుంటూ యూట్యూబ్ లో వీడియోలు చేశాం. నాకు ప్రవీణ్ కి మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. వాటి వల్లే మేమిద్దరం దూరమయ్యాం. ఆ సమస్యల గురించి నేను చెప్పుకోలేను. మేము అసలు మాట్లాడుకోవట్లేదు కూడా. మా మధ్య అండర్ స్టాండిగ్, బాండింగ్ బాగుండేది. అయితే వ్యక్తిగత విషయాలు వల్ల గొడవలు వచ్చినప్పుడు నాతో వచ్చి మాట్లాడాలి.

వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గొడవలను అందరి ముందు చెప్పుకుని దానిని పెద్దది చేయాలి అని నేను అనుకోవడం లేదు. ప్రవీణ్ కు తల్లిదండ్రులు లేరు. అతను ఏం మాట్లాడినా అది సింపథీ అయిపోతోంది. నేను ప్రవీణ్ మీద నింద వేయడం లేదు. కానీ, అతను చెప్పే మాటలు విని అంతా నన్ను నెగిటివ్ చేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరూ మా రిలేషన్ కు ఏ పేరూ పెట్టకండి” అంటూ పటాస్ ఫైమా రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. వారి మధ్య అసలు మాటలు కూడా లేవని తెలుసుకుని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లిద్దరు కలిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. అయితే పటాస్ ఫైమా మాత్రం వారి మధ్య అసలు మొదటి నుంచి ఎలాంటి రిలేషన్ లేదు అనే విషయాన్ని స్పష్టం చేసింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet