iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాను గెలిపించింది మ్యాక్స్‌వెల్‌ కానీ, తెర వెనుక ఓ హీరో కష్టం!

  • Published Nov 08, 2023 | 11:30 AMUpdated Nov 11, 2023 | 11:50 AM

క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోయేలా మ్యాక్స్‌వెల్‌ ఆడాడు. అద్భుతం అనే పదం కూడా తక్కువ అనిపిస్తోంది ఆ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి. అయితే.. ఆ గొప్ప ఇన్నింగ్స్‌ వెనుక ఓ హీరో కష్టం ఉంది. అతనెవరో ఇప్పుడు​ చూద్దాం..

క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోయేలా మ్యాక్స్‌వెల్‌ ఆడాడు. అద్భుతం అనే పదం కూడా తక్కువ అనిపిస్తోంది ఆ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి. అయితే.. ఆ గొప్ప ఇన్నింగ్స్‌ వెనుక ఓ హీరో కష్టం ఉంది. అతనెవరో ఇప్పుడు​ చూద్దాం..

  • Published Nov 08, 2023 | 11:30 AMUpdated Nov 11, 2023 | 11:50 AM
ఆస్ట్రేలియాను గెలిపించింది మ్యాక్స్‌వెల్‌ కానీ, తెర వెనుక ఓ హీరో కష్టం!

వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆవిష్కృతమైంది. ఓ ఆటగాడు కండరాల నొప్పితో బాధపడుతూ.. చివరి క్రీజ్‌లో నిలబడి.. ఇంతటి విధ్వంసం సృష్టిస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. వన్డే క్రికెట్‌ బతికున్నంత కాలం.. ఈ ఇన్నింగ్స్‌ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతగొప్ప ఇన్నింగ్స్‌ ఆడింది మరెవరో కాదు ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌.. మంగళవారం రాత్రి నుంచి క్రికెట్‌ ప్రపంచంలో మారుమోగిపోతున్న పేరు మ్యాక్స్‌వెల్‌. 292 పరుగులు భారీ లక్ష్యఛేదనలో కేవలం 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లోకి వెళ్లిపోయిన జట్టును.. వీరోచిత పోరాటం, విధ్వంసపు బ్యాటింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇది ఎందుకు అంత గొప్ప ఇన్నింగ్స్‌ అయింది? గెలిచింది పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ మీదే కదా? అని కొంతమంది భావించి ఉండొచ్చు. కానీ, కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌ ఆడుతున్న తీరు, ఇదే ఆసీస్‌పై వాళ్లు బ్యాటింగ్‌ చేసిన విధానం చూస్తే వారిని చిన్న టీమ్‌గా ఎవరూ అనుకోరు. నిజానికి మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో ఆసీస్‌ వణికించింది ఆఫ్ఘాన్‌. మూడొంతుల మ్యాచ్‌ ముగిసే వరకు కూడా ఆఫ్ఘాన్‌దే విజయం అనుకున్నారు అంతా. కానీ, ఆసీస్‌ ఓటమికి ఒక్కడు అడ్డుపడ్డాడు. మొత్తం ఆఫ్గాన్‌ జట్టను మ్యాక్స్‌వెల ఒంటిచేత్తో ఓడించాడు. 34 పరుగుల వద్ద అవుట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మ్యాక్సీ.. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. బౌలర్‌ ఎవరైనా, ఎలాంటి బంతులు వేసినా.. బాదడమే పనిగా పెట్టుకున్నాడు.

అయితే.. మ్యాక్సీ ఇంత విధ్వంసం సృష్టించేందుకు ఓ వ్యక్తి అండగా నిలిచాడు. ఓ ఎండ్‌లో వికెట్‌ను కాపుకాస్తూ.. మ్యాక్స్‌వెల్‌కు మద్దుత అందించాడు. అతనే ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. అతను ఆడింది పూర్తిగా నిస్వార్థపూరిత ఇన్నింగ్స్‌. ఇంత గొప్ప విజయంలో నేనూ భాగం కావాలి ఓ రెండు మూడు షాట్లు ఆడేందాం అని ఎక్కడా తొందర పడలేదు. 68 బంతులు దాదాపు 11.2 ఓవర్లు ఆడి కేవలం 12 పరుగులే చేసినా.. మ్యాక్స్‌వెల్‌ చేసిన అద్భుతానికి ఆయువు పట్టు కమిన్స్‌ ఆడిన ఇన్నింగ్స్‌. అందరూ మ్యాక్స్‌వెల్‌ను పొగుడుతున్నారు.. అందులో తప్పులేదు. కానీ, మ్యాక్స్‌వెల్‌ గెలుపు వెనుక కనిపించని హీరో కమిన్స్‌. ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా.. ఎంతో చక్కగా మ్యాక్స్‌వెల్‌కు స్ట్రైక్‌ ఇస్తూ.. నీకేం పర్వాలేదు నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తూ.. మ్యాక్సీ ఫ్రీగా ఆడేందుకు సహాయపడ్డాడు. కమిన్స్‌ అలా ఆడకపోయి ఉంటే.. మరో వికెట్‌ పడితే.. మ్యాక్స్‌వెలపై కచ్చితంగా ఒత్తిడి పెరిగేది. ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. ఓ ఎండ్‌లో కమిన్స్‌ నిలదొక్కుకుపోవడంతోనే మ్యాక్స్‌వెల డబుల్‌ సెంచరీ సాధ్యమైంది. మరి కమిన్స్‌ ఆడిని నిస్వార్థపూరిత ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి