iDreamPost

దారుణం.. టికెట్ అడిగాడని TTEని రైలు నుండి తోసేశారు! ఎక్కడంటే?

రైలు ప్రయాణాలంటే చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వరుస ప్రమాదాలు, అనుచిత ఘటనలు జర్నీ అంటే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ హేయమైన ఘటన భయాందోళనకు గురి చేస్తుంది.

రైలు ప్రయాణాలంటే చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వరుస ప్రమాదాలు, అనుచిత ఘటనలు జర్నీ అంటే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ హేయమైన ఘటన భయాందోళనకు గురి చేస్తుంది.

దారుణం.. టికెట్ అడిగాడని TTEని రైలు నుండి తోసేశారు! ఎక్కడంటే?

రైలు ప్రయాణంలో జరుగుతున్న హేయమైన ఘటనలు గురించి చదువుతూనే ఉన్నాం. మహిళా ప్రయాణీకులతో టీటీఈ అనుచితంగా ప్రవర్తించిన ఘటనల గురించి విన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన మాత్రం ఒళ్లు గగొర్పుడుస్తోంది. ట్రైన్ జర్నీ అంటేనే భయపడేలా మారింది. కదులుతున్న రైలు నుండి టీటీఈని ప్రయాణీకుడు తోసేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొనడంతో టీటీఈ అక్కడిక్కడే మృతి చెందాడు. వలస కార్మికుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే పాలక్కాడ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన ఎర్నాకుళం- పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లో మంగళవారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆ రైలులోని ఎస్ 11 కోచ్ లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్నాడు వినోద్. ఆ భోగీలోకి ఎక్కిన ఒడిశాకు చెందిన వలస కార్మికుడైన రజనీకాంత్ వద్దకు వెళ్లి టికెట్ చూపించాలని కోరాడు టీటీఈ. అయితే తన వద్ద జనరల్ టికెట్ ఉందని చూపించాడు. ఈ టికెట్‌తో కోచ్‌లో ప్రయాణించకూడదని, జనరల్ బోగికి వెళ్లాలని చెప్పాడు. ప్రయాణీకుడు వెళ్లేందుకు నిరాకరించాడు. అయితే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని టీటీఈ చెప్పాడు. డబ్బులు లేవని చెప్పడంతో.. ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ సమయంలో ట్రైన్ త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెలప్పయ్య ప్రాంతానికి చేరుకుంది.

ఈ గొడవలో టీటీఈని ప్రయాణీకుడు తోసేయడంతో.. రైలు పట్టాలపై పడిపోయాడు. అంతలో ఎదురుగా వస్తున్న రైలు వినోద్ మీద నుండి దూసుకెళ్లడంతో అతడి శరీరం చిధ్రమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల రజనీకాంత్‌ను అరెస్టు చేశారు. అతడు అరెస్టు చేసే సమయానికి ప్రయాణీకుడు మద్యం సేవించినట్లు గుర్తించారు. ఇక ఎర్నాకులం ప్రాంత నివాసి అయిన వినోద్ టీటీఈగా విధులు నిర్వహిస్తూనే.. మలయాళ ఇండస్ట్రీల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నాడు. మోహన్ లాల్ నటించిన మిస్టర్ ఫ్రాడ్, పులిమురుగన్ (మన్యం పులి)తో పాటు విక్రమాదిత్యన్, మంగ్లీష్ వంటి తదితర చిత్రాల్లో నటించాడు. వినోద్ మూడు నెలల క్రితం ఎర్నాకులం జిల్లా మంజుమల్‌లో కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ ఘోర విషాదంతో అతని కుటుంబం విషాదంలో నిండిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి