iDreamPost

నిరసనలతో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

నిరసనలతో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంగించారు.

ప్రభుత్వ విజయాలు, లక్ష్యాలను రాష్ట్రపతి సభలో ప్రస్తావిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తృణముల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీ తదితర పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టాల అమలను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.

ప్రతిపక్ష పార్టీల సభ్యుల నిరసనతో సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్యనే రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతి అంశంపై చర్చించడం వల్ల ప్రజాస్వామం మరింత బలంగా మారుతుందని, ఆందోళన వల్ల అది సాధ్యం కాదంటూ రాష్ట్రపతి ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. నిరసనలు విరమించి చర్చ చేయాలని సూచించడంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు శాంతించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ఉభయ సభల సంయుక్త సమావేశం వాయిదా పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి