iDreamPost

బ్రేకింగ్: రాహుల్ గాంధీకి అస్వస్థత.. అసలేం జరిగిందంటే?

Rahul Gandhi is ill: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే లోక్ సభ మొదటి విడత ఎన్నికలు జరిగాయి.. త్వరలో రెండో విడత జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు.

Rahul Gandhi is ill: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే లోక్ సభ మొదటి విడత ఎన్నికలు జరిగాయి.. త్వరలో రెండో విడత జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు.

బ్రేకింగ్: రాహుల్ గాంధీకి అస్వస్థత.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈ క్రమంలో జాతీయ నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. త్వరలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహూల్ గాంధీ గత కొన్నిరోజులుగా వరుసగా ప్రచారాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. తాజాగా రాహూల్ గాంధీకి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ కారణంతోనే పలు రాష్ట్రాల్లో ఆయన ప్రచారం రద్దు చేసుకొని మల్లిఖార్జున్ ఖర్గేకి బాధ్యతలు అప్పగించారు. రాహూల్ గాంధీకి అసలు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.  ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహూల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. అస్వస్థత కారణంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్ లో రాహూల్ గాంధీ పర్యటన రద్దయ్యింది. ఈ రెండు రాష్ట్రాల్లోని సత్నా, రాంచిలో ఇండియా కూటమి మెగా ర్యాలీకి రాహూల్ గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ప్రచారం క్యాన్సల్ చేశారు. అయితే రాహూల్ గాంధీకి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సత్నాలో రాహూల్ కి బదులుగా మల్లిఖార్జున్ ఖర్గే హాజరవుతారనని పార్టీ వెల్లడించింది.

కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా ‘రాహూల్ గాంధీ ఈ రోజు సతనా, రాంచిలోని జరగబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలో లేరు. అందుకే ఈ బాధ్యతలను అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కు అప్పగిస్తున్నా’ అంటూ పోస్ట్ చేశారు. ఆ మద్య అసెంబ్లీ ఎన్నికల ముందు రాహూల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ దిగ్విజయంగా ముగిసింది. ఈ యాత్ర ప్రభావం కర్ణాటక, తెలంగాణలో మంచి ప్రభావం చూపించి అధికారంలోకి వచ్చిందని అంటారు. ఇదే స్ఫూర్తితో రాహూల్ గాంధి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి