iDreamPost

Shweta Basu శ్వేత బ‌సు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? క్రిమినల్ జస్టిస్: అధురా సచ్‌లో తన పాత్రకు ఎలా సిద్ధ‌మ‌వుతోంది?

Shweta Basu శ్వేత బ‌సు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? క్రిమినల్ జస్టిస్: అధురా సచ్‌లో తన పాత్రకు ఎలా సిద్ధ‌మ‌వుతోంది?

మాధవ్ మిశ్రా, రజత పతక విజేత, ఎల్‌ఎల్‌బి క్లిష్ట‌మైన కేసుతో తిరిగి వచ్చాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ షో, అంతుబ‌ట్ట‌ని మిస్ట‌రీ కేసును చేధించ‌బోతోంది. ఈ కేసు ప్రముఖ బాలనటి జరా అహుజా మరణం. హత్యలో ప్రధాన నిందితుడు ఆమె సోద‌రుడు ముకుల్ అహుజానే. BBC స్టూడియోస్‌(BBC Studios)తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్(Applause Entertainment) నిర్మించిన హాట్‌స్టార్ స్పెషల్స్( Hotstar Specials) క్రిమినల్ జస్టిస్: అధుర సచ్(Criminal Justice: Adhura Sach) ఆగస్ట్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

తెలివైన‌వాడు, న‌వ్వింగ‌లిగేవాడు ఈ అసాధార‌ణ‌ లాయ‌ర్ మాధ‌వ్ మిశ్ర‌. ఈ పాత్ర‌ను పంక్ త్రిపాఠీ(Pankaj Tripathi ) పోషిస్తున్నారు. ఆయ‌న‌తోపాటు శ్వేత బసు ప్ర‌సాద్, (Shweta Basu Prasad) స్వ‌స్తిక ముఖ‌ర్జీ( Swastika Mukherjee) ప్ర‌ణ‌బ్ కోహ్లీ( Purab Kohli) ఇలా తెలిసిన ముఖాలే ఉన్నాయి. ఈ నెల 26న స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న‌వేళ వేళ న‌టి శ్వేత బసు త‌న పాత్ర‌కు ఎలా సిద్ధ‌మైందో చెప్పింది. ఈ సీరీస్ లో శ్వేత‌బ‌సు పాత్ర పేరు లేఖ‌. ఈ పాత్ర‌కు బ్యాక్ స్టోరీ ఆమె సొంతంగా రాసుకుంది. కాబ‌ట్టి ఆ పాత్ర తీరుతెన్నులు బాగా తెలుసు. పాత్ర స్వ‌భావాన్ని బాగా అర్ధంచేసుకుంది. పాత్ర‌ను అవ‌గాహ‌న చేసుకోవ‌డం నా ప‌ద్ధ‌త‌ని శ్వేత అంటోంది.
శ్వేత బ‌సు ఫోటోల‌ను చూడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి