iDreamPost

చేతిలో రూపాయి లేనప్పుడు అండగా భార్య.. ఇప్పుడు ఇతను స్టార్ యాక్టర్!

కష్టాలను ఇష్టాలుగా మలుచుకుని.. అవమానాలు ఎదుర్కొని, విజయం వెక్కిరించినా వెనకడుగు వేయక.. అవకాశాలు రాలేదని బాధపడక.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యంత సామాన్యుడి స్థాయి నుండి స్టార్ యాక్టర్ హోదాకు ఎదిగాడు ఆ నటుడు. అందుకు కారణమైంది ఆయన భార్య. ఇంతకు అతడు ఎవరంటే..?

కష్టాలను ఇష్టాలుగా మలుచుకుని.. అవమానాలు ఎదుర్కొని, విజయం వెక్కిరించినా వెనకడుగు వేయక.. అవకాశాలు రాలేదని బాధపడక.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యంత సామాన్యుడి స్థాయి నుండి స్టార్ యాక్టర్ హోదాకు ఎదిగాడు ఆ నటుడు. అందుకు కారణమైంది ఆయన భార్య. ఇంతకు అతడు ఎవరంటే..?

చేతిలో రూపాయి లేనప్పుడు అండగా భార్య.. ఇప్పుడు ఇతను స్టార్ యాక్టర్!

సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి సెలబిట్రీగా మారడమే కాదు.. స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ మారుమూల ప్రాంతంలో పుట్టి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీసును శాసించే స్థాయికి ఎదిగాడు. అది కూడా 40 ఏళ్ల వయస్సులో క్రేజ్ సంపాదించుకోవడం చాలా పెద్ద మేటరే. యాక్టింగ్ అంటే ఫ్యాషన్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తొలినాళ్లలో అవమానాలు ఎదుర్కొని, చిన్నా చితకా వేషాలు వేసి.. చివరకు కష్టపడితే ప్రతిఫలం ఎప్పటికైనా దక్కుతుంది అని నిరూపించాడు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఇందులో అత్యంత సామాన్యుడిలా ఉన్న ఈ సెలబ్రిటినీ గుర్తు పట్టారా..?

తన సెలక్టివ్ కథలతో, యాక్టింగ్‌తో బీటౌన్ ఇండస్ట్రీని షేక్ చేయడమే కాదూ.. బాలీవుడ్‌ను ఏలేస్తున్న త్రీ కింగ్ ఖాన్స్‌ను కూడా భయపడేలా చేస్తున్నాడు. ఇంతకు అతడు ఎవరంటే.. మీర్జాపూర్ నటుడు కమ్ విలన్ పంకజ్ త్రిపాఠి. ఈ ఫోటోలో ఉన్నది ఆయనే. 1976లో బీహార్‌లోని ఓ గ్రామంలో పండిట్ బనారస్, హేమవంతి త్రిపాఠి దంపతులకు నాలుగవ సంతానం పుట్టిన ఆయన. చిన్నవాడైనా.. ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అర్థం చేసుకున్న పెద్ద మనస్సు ఉన్నవాడు. చిన్నప్పటి నుండే తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ.. పూజారిగా కూడా పనిచేశాడు. అయితే అతనికి నాటకాలు అంటే పిచ్చి. నాటకాలు వేసేవాడు. అమ్మాయి పాత్రలు కూడా పోషించాడు. 12వ తరగతి పూర్తయ్యాక తొలి సారిగా పట్నం బాట పట్టాడు.

Pankaj tripathi life story

హోటల్ మెనేజ్ మెంట్ కోర్సు చేసేందుకు పాట్నా వెళ్లిన అతడు.. నాటకాల పట్ల మరింత వ్యామోహానికి గురయ్యాడు. కానీ ఇంటి పరిస్థితులు, ఇతర విషయాలు పరిగణనలోకి తీసుకుని.. హోటల్‌లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో నాటక రంగంలో ప్రయత్నాలు కొనసాగించాడు. పగలు హోటల్లో పని చేయడం, రాత్రులు థియేటర్‌ నాటకాలు ప్రదర్శించడం చేసేవాడు. నాటకాలపై మరింత ఆసక్తి పెంచుకున్న అతడు..నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు కోర్సు పూర్తి చేసి.. స్ట్రీట్ షో, థియేటర్ నాటకాలు ప్రదర్శించారు. అప్పటికే పెళ్లి చేసుకుని ఉండటంతో ఆర్థిక సమస్యలు మరింత వెంటాడుతుండటంతో నాటకాలు కూడుపెట్టవని గ్రహించిన అతడు..భార్య మృదులను తీసుకుని ముంబయి నగరానికి వచ్చాడు. అనేక సార్లు ఆడిషన్స్ ఇచ్చాడు. అతడిని గుర్తింపు లేని, చిన్నచితకా రోల్స్ చేశాడు.

ఏడేళ్ల పాటు ఇలాంటి రోల్సే. కానీ నిరుత్సాహ పడలేదు. భార్య మరింతగా సపోర్ట్ చేసింది.  చేతిలో రూపాయి లేని సమయంలో కూడా అతడిలో ధైర్యాన్ని నింపింది. భార్య మృదుల ఇచ్చిన మానసిక స్థైర్యంతో  గట్టి ప్రయత్నాలు చేశాడు. 2012లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సిరీస్‌లు అతడిని నటుడిగా నిలబెట్టాయి. ఇక అక్కడ నుండి వరుసగా విలన్, కీ రోల్స్ పలకరించడం మొదలు పెట్టాయి. దంబగ్ 2, ఫక్రీ, సింగమ్ రిటర్స్న్, స్త్రీ, సూపర్ 30, 83, ఇటీవల వచ్చిన మర్డర్ ముబారక్ వరకు ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు పోషించాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం మీర్జాపూర్. ఈ వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇటు ఓటీటీ సినిమాలు, సిరీస్ చేస్తూనే.. అటు థియేటర్స్ మూవీలు చేస్తున్నారు. మీర్జాపూర్ 3లో నటిస్తున్నాడు. త్వరలో అమెజాన్ ప్రీమియంలో విడుదల కానుంది. వీటితో పాటు మరో 2 చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో మంచు విష్ణు సినిమా దూసుకెళ్తాలో నటించాడు.  ఇంచు మించు దేశంలో ఉన్న ముఖ్యమైన భాషలన్నీంటిలో పని చేసిన అనుభవం  ఆయన సొంతం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి