iDreamPost

PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు అక్కడి లింక్

విషయం చాలా ఉంది. ముందు ఆర్ఆర్ఆర్ సంగతి చూస్తే రెండేళ్ల క్రితం కరోనా తాకిడి విపరీతంగా ఉన్న టైంలో రాజమౌళి బృందం అక్కడికి వెళ్లి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకుంది. రెండు మూడు వారాలు అక్కడే గడిపింది. అంతెందుకు యుట్యూబ్, సోషల్ మీడియాని ఊపేసిన నాటు నాటు పాటను షూట్ చేసింది ఈ దేశంలోనే.

విషయం చాలా ఉంది. ముందు ఆర్ఆర్ఆర్ సంగతి చూస్తే రెండేళ్ల క్రితం కరోనా తాకిడి విపరీతంగా ఉన్న టైంలో రాజమౌళి బృందం అక్కడికి వెళ్లి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకుంది. రెండు మూడు వారాలు అక్కడే గడిపింది. అంతెందుకు యుట్యూబ్, సోషల్ మీడియాని ఊపేసిన నాటు నాటు పాటను షూట్ చేసింది ఈ దేశంలోనే.

PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు అక్కడి లింక్

అదేంటి అక్కడెక్కడో మనకు సంబంధం లేని చోట రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతుంటే మన టాలీవుడ్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. విషయం చాలా ఉంది. ముందు ఆర్ఆర్ఆర్ సంగతి చూస్తే రెండేళ్ల క్రితం కరోనా తాకిడి విపరీతంగా ఉన్న టైంలో రాజమౌళి బృందం అక్కడికి వెళ్లి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకుంది. రెండు మూడు వారాలు అక్కడే గడిపింది. అంతెందుకు యుట్యూబ్, సోషల్ మీడియాని ఊపేసిన నాటు నాటు పాటను షూట్ చేసింది ఈ దేశంలోనే. ఉక్రెయిన్ ప్యాలెస్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల మీద చిత్రీకరణ జరిపారు. ప్రభాస్ రాధే శ్యామ్ కు సంబంధించిన విఎఫ్ఎస్ వర్క్ తాలూకు పనులు ఉక్రెయిన్ లోనే జరిపారు. మంచి వనరులు అక్కడ అందుబాటులో ఉండటంతో రెండు పాన్ ఇండియా సినిమాలు అక్కడికి వెళ్లాయి.

అందుకే ఇప్పుడక్కడ పరిస్థితిని తలుచుకుని రెండు బృందాలు అయ్యో అనుకుంటున్నాయి. రష్యా పోకడ వల్ల ఉక్రెయిన్ లో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న భారతీయులను మన విద్యార్థులను యుద్ధప్రాతిపాదికన విమానాల్లో తెచ్చేస్తున్నారు. భయానక వాతావరణంలో ఎన్ని వందల వేల ప్రాణాలు పోతాయో అంతుచిక్కడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగిసినా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడుతుంది. చిన్న దేశమే అయినా టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా ప్రోగ్రెస్ లో ఉన్న ఉక్రెయిన్ లో గతంలో బాలీవుడ్ సినిమాలు సైతం షూటింగులు గ్రాఫిక్స్ వర్క్ చేసుకున్నాయి.

ఇప్పుడు ఇంకో నెల రోజుల్లో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ విడుదల కాబోతున్నాయి. ఈ టైంలో ఆ దేశం వాళ్లకు సినిమా చూసే ఛాన్స్ లేకపోవడం దురదృష్టకరం. అప్పుడెప్పుడో సాయి ధరమ్ తేజ్ విన్నర్ కూడా కొంత భాగం అక్కడే తీశారట. ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడిన దేశంలో ఇలాంటి సిచువేషన్ రావడం బ్యాడ్ లక్. దాని సంగతి ఎలా ఉన్నా రెండు వారాల వ్యవధి రాబోతున్న పాన్ ఇండియా మూవీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యుద్ధం వల్ల ఏదైనా విధ్వంసం లాంటిది జరిగి మన సినిమాలు షూటింగ్ జరుపుకున్న చోట ఆనవాళ్లు చెరిగిపోకుండా ఉండాలనే అందరూ కోరుకుంటున్నారు.

Also Read : DJ Tillu : స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న లేటెస్ట్ హిట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి