iDreamPost

WORLD CUP: న్యూజిలాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి! కేన్‌ మామ రీ ఎంట్రీ

  • Published Sep 30, 2023 | 12:13 PMUpdated Sep 30, 2023 | 12:13 PM
  • Published Sep 30, 2023 | 12:13 PMUpdated Sep 30, 2023 | 12:13 PM
WORLD CUP: న్యూజిలాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి! కేన్‌ మామ రీ ఎంట్రీ

వరల్డ్‌ కప్‌ సందడి మొదలైపోయింది. అఫిషీయల్‌గా అక్టోబర్‌ 5 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లు షురూ అయ్యాయి. తొలుత హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్‌ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా భారీ స్కోర్లు చేసినా.. న్యూజిలాండ్‌ చాలా ఈజీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేసి.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఒక్క పరుగే చేసి విఫలమైనా.. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్‌ షఫీక్‌ 14 రన్స్‌ మాత్రమే చేశాడు.

బాబర్‌ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 80 రన్స్‌ చేశాడు. ఇక రిజ్వాన్‌ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 103 పరుగులు చేసి రిటైర్డ్‌ హార్ట్‌ అయ్యాడు. సౌద్‌ షకీల్‌ 75, అఘా సల్మాన్‌ 33 పరుగులతో రాణించారు. వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ 16 రన్స్‌ మాత్రమే చేశాడు. ఇఫ్తికర్‌ అహ్మద్‌ 7 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నర్‌ 2, హెన్రీ, నీషమ్‌, ఫెర్గూసన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. నీషమ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 346 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ చాలా సులువుగా.. కేవలం 43.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన టార్గెట్‌ను ఊదిపారేసింది.

స్టార్‌ బ్యాటర్‌, ఓపెనర్‌ డెవాన్‌ కాన్వె డకౌట్‌ అయినా కూడా కివీస్‌ ఇబ్బంది పడలేదు. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర 72 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 97 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక మన కేన్‌ మామ తనకు అచ్చొచ్చిన హోం గ్రౌండ్‌ లాంటి ఉప్పల్‌ స్టేడియంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. 50 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేసి.. కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. డారిల్‌ మిచెల్‌ సైతం 59 రన్స్‌తో రాణించాడు. టామ్‌ లాథమ్‌ 18, గ్లెన్‌ ఫిలిప్స్‌ 3 రన్స్‌ మాత్రమే చేసి విఫలమైనా.. నీషమ్‌ 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. సాంట్నర్‌ ఒక రన్‌తో నాటౌట్‌గా నిలిచాడు. విలియమ్సన్‌, మిచెల్‌ రిటైర్డ్‌ హార్ట్‌ అయ్యారు. ఇక ఈ మ్యాచ్‌ విజయంతో న్యూజిలాండ్‌కు ఫుట్‌ కాన్ఫిడెన్స్‌ వచ్చినట్లు అయింది. అయతే పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిదీ మాత్రం ఈ మ్యాచ్‌లో బౌలింగ​ వేయలేదు. మరి కివీస్‌ చేతిలో పాక్‌ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గౌతం గంభీర్​కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. ఎందుకిలా చేసినట్లు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి