iDreamPost

గౌతం గంభీర్​కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. ఎందుకిలా చేసినట్లు?

  • Author singhj Published - 10:28 AM, Sat - 30 September 23
  • Author singhj Published - 10:28 AM, Sat - 30 September 23
గౌతం గంభీర్​కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. ఎందుకిలా చేసినట్లు?

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ సందడి మొదలైంది. ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో పాల్గొనే 10 జట్లు ఇప్పటికే భారత్ చేరుకున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడేశాయి. ఇవాళ టీమిండియా, ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీలో అసలు సిసలైన పోరు మాత్రం అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ సక్సెస్ కావాలంటే ఆటగాళ్ల హోరాహోరీ పోరాటాలతో పాటు దానికి తగ్గట్లు కామెంట్రీ కూడా ఆ స్థాయిలో ఉండాల్సిందే. ప్లేయర్లు కొదమసింహాల్లా పోరాడుతుంటే దాన్ని కామెంట్రీతో నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లే వ్యాఖ్యాతలు ఉండాల్సిందే. వన్డే వరల్డ్ కప్-2023 కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కామెంటేటర్ల లిస్టును రిలీజ్ చేసింది.

ప్రపంచ కప్ కామెంటేటర్ల ప్యానెల్​లో మొత్తంగా 31 మంది ప్లేస్ దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన పలువురు వరల్డ్ కప్ విన్నర్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో భారత్​ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. హర్షా భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, దినేష్ కార్తీక్, అంజుమ్ చోప్రాలు ఐసీసీ ప్రకటించిన కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీళ్లు వన్డే వరల్డ్ కప్​లో తమ గొంతుకు పని చెప్పనున్నారు. మ్యాచ్ కామెంట్రీ, ప్రీ మ్యాచ్ షోతో పాటు మిడ్ ఇన్నింగ్స్, పోస్ట్ మ్యాచ్ ప్రోగ్రామ్స్​లో వీళ్లు పాల్గొననున్నారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్​కు ఐసీసీ షాక్ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్​ కామెంటేటర్స్ ప్యానెల్​లో అతడికి అవకాశం దక్కలేదు.

ఇటీవల జరిగిన ఆసియా కప్​లో కామెంటేటర్​గా వ్యవహరించిన గంభీర్​కు వరల్డ్ కప్ ప్యానెల్​లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై అతడి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ఎందుకిలా చేసిందంటూ ఫైర్ అవుతున్నారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్ కోసం కామెంటేటర్​గా పాక్ తరఫున రమీజ్ రాజాను సెలెక్ట్ చేశారని.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చీఫ్​గా ఉన్నప్పుడు చేసిన అతడు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. ఆసియా కప్​ కోసం భారత్ పాక్​కు రాకపోతే.. వరల్డ్ కప్ కోసం తమ జట్టు ఇండియాకు వెళ్లబోదని అప్పట్లో రమీజ్ అన్నారు. అలాంటి కామెంట్స్ చేసిన రమీజ్​కు కామెంట్రీ ప్యానెల్​లో ఎందుకు చోటిచ్చారని.. అతడి ప్లేసులో గంభీర్​ను తీసుకొని ఉంటే బాగుండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​ టీమ్​లో అతడ్ని తీసుకోకుండా తప్పు చేశారు: యువీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి