iDreamPost

Haris Rauf: అభిమానిని కొట్టేందుకు దూసుకెళ్లిన పాక్‌ ప్లేయర్‌! వీడియో వైరల్..

అమెరికాలో అభిమానిని కొట్టేందుకు దూసుకెళ్లాడు పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్. తన భార్య నిలువరిస్తున్నా.. కోపంతో ఫ్యాన్ పైకి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

అమెరికాలో అభిమానిని కొట్టేందుకు దూసుకెళ్లాడు పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్. తన భార్య నిలువరిస్తున్నా.. కోపంతో ఫ్యాన్ పైకి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

Haris Rauf: అభిమానిని కొట్టేందుకు దూసుకెళ్లిన పాక్‌ ప్లేయర్‌! వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శనతో ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్ లోనే క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో ఓడిపోయి.. తీవ్ర విమర్శలపాలైంది. ఆ తర్వాత ఇండియా చేతిలో కూడా ఓడిపోయింది. నెక్ట్స్ రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాక్ ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్ 8కు అర్హత సాధించింది. కాగా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆటగాళ్లు అమెరికాలో సేదతీరుతున్నారు. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్ పేసర్ హారీస్ రౌఫ్ తన భార్యతో కలిసి యూఎస్ఏ వీధుల్లో నడుస్తుంటే.. ఓ అభిమాని ఏదో అన్నాడు. దాంతో కోపం పట్టలేకపోయిన రౌఫ్ అతడిపైకి దూసుకెళ్లాడు.

పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్ హాట్ టాపిక్ గా మారాడు. దానికి కారణం ఏంటంటే? వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన పాక్ ప్లేయర్లు.. అమెరికాలో సరదాగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ కూడా తన ఫ్యామిలీతో వీధుల వెంట నడుస్తు.. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో అటుగా వస్తున్న ఫ్యాన్ రౌఫ్ ను చూసి ఏదో అన్నాడు. వెంటనే కోపం పట్టలేకపోయిన రౌఫ్.. తన భార్య వద్దు అంటున్నా వినకుండా.. కోపంగా అభిమాని దగ్గరికి దూసుకొచ్చాడు.

దాంతో పక్కనున్న వ్యక్తులు, సెక్యూరిటీ రౌఫ్ ను నిలువరించారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫ్యామిలీతో ఉన్న టైమ్ లో అభిమాని నోరు పారేసుకోవడంతో కోపం పట్టలేకపోయాడు రౌఫ్. వేగంగా అతడిపైకి దూసుకొచ్చి.. ఫైటింగ్ చేయబోయాడు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు అతడిని అడ్డగించారు. దాంతో పెద్ద గొడవ జరిగే ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి