iDreamPost
android-app
ios-app

పాక్ ను నిండా ముంచిన బాబర్! తిట్టిపోస్తున్న అభిమానులు!

  • Author Soma Sekhar Published - 07:24 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 07:24 PM, Thu - 14 September 23
పాక్ ను నిండా ముంచిన బాబర్! తిట్టిపోస్తున్న అభిమానులు!

బాబర్ అజం.. సమకాలీన క్రికెట్ చరిత్రలో నిలకైడన బ్యాటర్ గా, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడిగా అతడికి మంచి గుర్తింపు ఉంది. పైగా అతడు ఈ ఏడాది పలు ఐసీసీ అవార్డులు కూడా గెలచుకున్నాడు. కానీ పాకిస్థాన్ అభిమానులు మాత్రం అతడిని తిట్టిపోస్తున్నారు. అదేంటి.. ఇంత గొప్ప ఆటగాడిని, పైగా పాక్ కెప్టెన్ గా సమర్థవంతంగా జట్టును నడిపిస్తున్నాడు కూడా. అలాంటి బాబర్ ను సొంత ఫ్యాన్సే ఎందుకు తిడుతున్నారని మీకు అనుమానం రావొచ్చు. దానికి కారణం ఆసియా కప్ లో పాక్ ను నిండా ముంచింది బాబరే కావడం. దానికి కొన్ని లెక్కలను సైతం పాక్ ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్ లోకూడా 29 పరుగులకే అవుటై దారుణంగా విఫలం అయ్యాడు బాబర్. దీంతో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీని చూసైనా బుద్ది తెచ్చుకో అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు పాక్ ఫ్యాన్స్.

ఏ ఆటగాడికైనా వ్యక్తిగత రికార్డుల కంటే.. జట్టు విజయాలకే ఎక్కవ ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ పాక్ కెప్టెన్ బాబర్ మాట వేరే విధంగా ఉంది. జట్టు విజయాల కంటే వ్యక్తిగత రికార్డులకే విలువెక్కువ అన్నట్లుగా అతడి ఆట సాగుతోంది. జట్టు విజయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. తన సొంత రికార్డుల గురించే బాబర్ ఎక్కువగా ఆలోచిస్తాడని పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదీకాక తాజాగా జరుగుతున్న ఆసియా కప్ లో పాక్ జట్టును నిండా ముంచింది బాబరే అంటూ విమర్శిస్తున్నారు. దానికి కారణం అతడి ఆటతీరు ఒకే విధంగా లేకపోవడమే. చిన్న జట్లపై శతకాలు సాధిస్తూ.. రికార్డులు నెలకొల్పుతున్నన బాబర్, పెద్ద జట్లపై మాత్రం పేవల ప్రదర్శన ఇస్తున్నాడు. ఇది స్పష్టంగా ఈ ఆసియా కప్ లో కనిపించిందని పాక్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో పసికూన నేపాల్ పై 151 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పిన బాబర్.. అంతకు ముందు ఆడిన మ్యాచ్ ల్లో ఇండియాపై 10, బంగ్లాదేశ్ పై 17 పరుగులు చేశాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్ లో సైతం 29 పరుగులకే అవుటై విమర్శలపాలైయ్యాడు. దీంతో పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బాబర్ ను ఆడుకుంటున్నారు. చిన్న టీమ్స్ పై ఆడి రికార్డులు సాధించడం కాదు.. పెద్ద టీమ్స్ పై ఆడి జట్టును గెలిపించడం నేర్చుకో అంటూ.. ఎద్దేవ చేస్తున్నారు. పొద్దున లేస్తే.. కోహ్లీతో పోల్చుకోవడం కాదు.. అతడిని చూసి నేర్చుకో అంటూ హితబోధ చేస్తున్నారు. కోహ్లీ నీలా రికార్డుల కోసం ఆడడు.. జట్టు కోసం ఆడతాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పసికూనలపై ఆడి.. పెద్ద జట్లపై విఫలం అవ్వడంపై దృష్టిపెట్టు అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఆసియా కప్ లో పాక్ ను నిండా ముంచింది బాబరే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.