iDreamPost

కూలీల అవతారమెత్తిన పాక్ క్రికెటర్లు.. ఈ బాధ పగోడికీ రాకూడదు!

  • Author singhj Updated - 08:38 PM, Sun - 3 December 23

పాకిస్థాన్ క్రికెటర్లు కూలీల అవతారం ఎత్తారు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పాపం.. ఈ బాధ పగోడికీ రాకూడదని అంటున్నారు.

పాకిస్థాన్ క్రికెటర్లు కూలీల అవతారం ఎత్తారు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పాపం.. ఈ బాధ పగోడికీ రాకూడదని అంటున్నారు.

  • Author singhj Updated - 08:38 PM, Sun - 3 December 23
కూలీల అవతారమెత్తిన పాక్ క్రికెటర్లు.. ఈ బాధ పగోడికీ రాకూడదు!

వన్డే వరల్డ్ కప్-2023 నుంచి పాకిస్థాన్ క్రికెట్​కు ఏదీ కలసి రావడం లేదు. మెగా టోర్నీలో చెత్తాటతో సెమీస్​కు క్వాలిఫై కావడంలో దాయాది జట్టు ఫెయిలైంది. నాకౌట్​కు చేరుకోకుండానే వెనక్కి తిరిగి రావడంతో పాక్ క్రికెటర్లు, బోర్డు ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. జట్టు సరిగ్గా ఆడకపోవడంతో బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెట్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఫెయిల్యూర్​కు బాధ్యత వహిస్తూ చీఫ్ సెలక్టర్ పోస్టు నుంచి వైదొలిగాడు ఇంజమాముల్ హక్. అంచనాలను అందుకోలేకపోయినందుకు కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్​బై చెప్పాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా చాలా మార్పులు చేసింది.

టీమ్ డైరెక్టర్​గా మహ్మద్ హఫీజ్​ను నియమించింది పీసీబీ. టీ20, టెస్టు ఫార్మాట్లకు కొత్త కెప్టెన్లను సెలక్ట్ చేసింది. చీఫ్ సెలక్టర్​గా వాహబ్ రియాజ్​ను ఎంచుకుంది. అలాగే సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా మాజీ కెప్టెన్ సల్మాన్ భట్​ను సెలక్ట్ చేసింది. ఒకప్పుడు స్పాట్ ఫిక్సింగ్​ కేసులో భట్ శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఎన్నో మార్పుచేర్పుల మధ్య ఆస్ట్రేలియాతో సిరీస్​కు సిద్ధమైపోయింది పాకిస్థాన్. కంగారూలతో టెస్ట్ సిరీస్ కోసం దాయాది జట్టు అక్కడికి చేరుకుంది. అయితే ఈ సందర్భంగా ఎయిర్​పోర్ట్ దగ్గర జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాక్ టీమ్ ఆస్ట్రేలియాకు చేరుకుంది. కరాచీ నుంచి ఫ్లైట్ ద్వారా కాన్​బెర్రాకు చేరుకున్నారు పాక్ క్రికెటర్లు. అయితే ఎయిర్​పోర్ట్​ వద్ద వాళ్ల లగేజీని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. దీంతో కూలీల అవతారం ఎత్తిన ప్లేయర్లు.. లగేజీని స్వయంగా మోసుకుంటూ వెళ్లి ఒక ట్రక్కులో నింపి తీసుకెళ్లారు. పాక్ క్రికెటర్లు లగేజీని మోసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. పాపం పాక్ క్రికెటర్లు వీళ్ల బాధ పగోడికీ రాకూడదని అంటున్నారు. అయితే ఆసీస్ బోర్డు వ్యవహరించిన తీరు సరికాదని.. ఇంటర్నేషనల్ క్రికెటర్లతో ఇలాగేనా వ్యవహరించేది? అంటూ పాక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

కాగా, ఆసీస్ టూర్​కు వచ్చిన పాక్ టీమ్​కు షాన్ మసూద్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ మొదలవ్వడానికి ముందు పాక్ జట్టు తొలుత ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్​తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్​ కాన్​బెర్రాలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. అనంతరం డిసెంబర్ 14వ తేదీన పెర్త్ వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు మ్యాచ్ మొదలవ్వనుంది. సిరీస్​లో రెండో టెస్టు డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మెల్​బోర్న్ వేదికగా జరగనుంది. ఇదే బాక్సింగ్​ డే టెస్ట్. ఇక ఆఖరి మ్యాచ్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ సైకిల్​లో పాక్​ టీమ్​కు ఇది రెండో టెస్ట్ సిరీస్ కావడం గమనార్హం. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్​ను దాయాది జట్టు 2-0 తేడాతో గెలుచుకుంది. గత 28 ఏళ్లుగా ఆసీస్​లో టెస్ట్ మ్యాచ్​ గెలుపొందని రికార్డును ఈసారైనా పాక్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. మరి.. పాక్ క్రికెటర్లు కూలీలుగా మారడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీని తక్కువ చేసి మాట్లాడే వారికి గట్టిగా ఇచ్చిపడేసిన బ్రియాన్ లారా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి