iDreamPost

Virat Kohli: కోహ్లీని తక్కువ చేసి మాట్లాడే వారికి గట్టిగా ఇచ్చిపడేసిన బ్రియాన్ లారా!

  • Author singhj Updated - 02:30 PM, Sun - 3 December 23

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసుకొని కామెంట్స్, ట్రోల్ చేసేవారికి వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఇచ్చిపడేశాడు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసుకొని కామెంట్స్, ట్రోల్ చేసేవారికి వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఇచ్చిపడేశాడు.

  • Author singhj Updated - 02:30 PM, Sun - 3 December 23
Virat Kohli: కోహ్లీని తక్కువ చేసి మాట్లాడే వారికి గట్టిగా ఇచ్చిపడేసిన బ్రియాన్ లారా!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే భారత అభిమానులు బయటపడుతున్నారు. అదో పీడకల అని దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న టీమిండియా.. తుదిమెట్టుపై తడబడి ట్రోఫీని దూరం చేసుకుంది. పదికి 10 మ్యాచుల్లో నెగ్గి.. మెగా కప్పుపై ఎన్నో ఆశలు రేపి ఆఖరికి వాటిని ఆవిరి చేసింది. స్థాయికి తగ్గట్లుగా పెర్ఫార్మ్ చేస్తే టీమిండియా ఒడిలో మూడో వరల్డ్‌ కప్ వచ్చి చేరేది. కానీ సొంతగడ్డ మీద వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నామనే ప్రెజర్ మన ప్లేయర్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎలాగైనా గెలవాలనే కసి కంటే.. ఎక్కడ ఓడిపోతామోననే భయం, ఒత్తిడి ఎక్కువగా కనిపించాయి. దీన్ని క్యాష్ చేసుకుంది ప్రత్యర్థి ఆసీస్. భారత్​తో పోల్చుకుంటే ప్రతి డిపార్ట్​మెంట్​లోనూ అద్భుతంగా రాణించి వరల్డ్ కప్​ను ఎగరేసుకుపోయింది.

ప్రపంచ కప్ ఓటమితో భారత ఆటగాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మన ప్లేయర్లు ఒత్తిడికి చిత్తయ్యారని.. తమ బెస్ట్ ఇవ్వలేకపోయారనే కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద అనేక విమర్శలు వచ్చాయి. కింగ్ తన రేంజ్​కు తగ్గట్లుగా ఆడితే కప్పు కొట్టేవారమని.. కానీ అందులో ఫెయిల్ అయ్యాడని అన్నారు. అయితే మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. 11 ఇన్నింగ్స్​లో కలిపి ఏకంగా 765 రన్స్ చేశాడు. వన్డే వరల్డ్ కప్​ ఎడిషన్​లో ఏడొందల పరుగుల మార్క్ దాటిన తొలి క్రికెటర్​గానూ నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్​లోనూ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినా అతడిపై విమర్శలు తగ్గడం లేదు. ఎంత బాగా ఆడితేనేం జట్టుకు కప్ తీసుకురాలేకపోయాడంటూ అతడ్ని తక్కువ చేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీని వెనకేసుకొచ్చాడో లెజెండరీ క్రికెటర్.

విరాట్ కోహ్లీని విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా వెనకేసుకొచ్చాడు. అతడ్ని తక్కువ చేసి మాట్లాడేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్​ను చాలా మంది తక్కువ చేశారని.. కానీ అలా చేయడం సరికాదన్నాడు లారా. ‘టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గలేదు. కాబట్టి విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడినా ఏం లాభం? అని చాలా మంది అంటున్నారు. కానీ అదేంటో నాకు తెలుసు. టీమ్ స్పోర్ట్స్​లో నెగ్గడం చాలా ముఖ్యం. టీమ్​లో ఆటగాడిగా గెలిపించడమే మన అంతిమ లక్యం అవ్వాలి. కానీ టీమ్ నెగ్గాలంటే మాత్రం పర్సనల్​గా మనం కూడా మెరుగ్గా ఆడాలి’ అని లారా చెప్పుకొచ్చాడు. కోహ్లీని ఉద్దేశించి లారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్​ను లారా వెనకేసుకు రావడంపై అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. కోహ్లీని ఉద్దేశించి లారా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yuzvendra Chahal: చాహల్​కు లాలీపాప్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు.. సెలక్టర్లపై భజ్జీ సెటైర్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి