iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ లో అవకాశం రావాలంటే అవసరం తీర్చాల్సిందే.. ఈ సిరీస్ కి బుర్ర పాడవుతుంది!

OTT Suggestions- Best Watch Alone Web Series Hollywood: వెబ్ సిరీస్ అంటే యాక్షన్, కామెడీ మాత్రమే కాదు.. కాస్త డ్రామా కూడా ఉంటుంది. అలాంటి ఒక బెస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా అవకాశం, అవసరం అనే పదాల మీద నడుస్తూ ఉంటుంది.

OTT Suggestions- Best Watch Alone Web Series Hollywood: వెబ్ సిరీస్ అంటే యాక్షన్, కామెడీ మాత్రమే కాదు.. కాస్త డ్రామా కూడా ఉంటుంది. అలాంటి ఒక బెస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా అవకాశం, అవసరం అనే పదాల మీద నడుస్తూ ఉంటుంది.

హాలీవుడ్ లో అవకాశం రావాలంటే అవసరం తీర్చాల్సిందే.. ఈ సిరీస్ కి బుర్ర పాడవుతుంది!

సాధారణంగా మీరు కాస్టింగ్ కౌచ్.. అవకాశం ఇవ్వాలి అంటే మాకేంటి అంటారు అనే మాటలు చాలానే విని ఉంటారు. ఎంతో మంది యాక్టర్స్ మీటూ అని.. కాస్టింగ్ కౌచ్ అని చాలానే ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే ఇది కేవలం ఇండియన్ సినిమాలో మాత్రమే కాదు.. హాలీవుడ్ లో కూడా బాగానే ఉంటుంది. ఈ విషయం మేము చెప్పడం లేదు. హాలీవుడ్ వాళ్లే ఒక వెబ్ సిరీస్ తీసి మరీ.. అప్పట్లే మా పరిస్థితి ఇదీ అని చెప్పుకున్నారు. అయితే ఈ సిరీస్ లో చాలా విషయాలను కాస్త బో*ల్డ్ గానే హ్యాండిల్ చేశారు. కొన్ని సీన్స్ అయితే మీకు బుర్ర పాడు చేసేస్తాయి. కొన్ని సీన్స్ కి నోరెళ్లబెట్టేస్తారు.

సాధారణంగా మీరు కాస్త బో*ల్డ్ గా ఉండే వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే సీన్స్ మాత్రమే కాదు.. కథ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అందరూ హాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు. అంతా మంచి మంచి ఆర్టిస్టులు కావాలి అని న్యూయార్క్ నగరం చేరుకుంటారు. కానీ, అందరూ అనుకున్నది ఒకటి అయితే అక్కడి పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇంకేముంది.. అక్కడ అవకాశం రావాలి అంటే అవసరాలు తీర్చే పరిస్థితి వస్తుంది. కొందరు అస్సలు వెనుకాడకుండా ఏది అడిగితే అది ఇచ్చేందుకు సిద్ధపడి ఉంటారు.

అలాగే అక్కడ వైట్ పీపుల్ మాత్రమే ఎక్కువగా యాక్టర్స్ అవుతూ ఉంటారు. కానీ, బ్లాక్ పీపుల్ విషయానికి వచ్చే సరికి మాత్రం అవకాశాలు లేక అలాగే ఉండిపోతారు. టాలెంట్ ఎంత ఉన్నా కూడా కేవలం రంగు ఆధారంగా వారిని దూరం పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ సీరిస్ లో కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోరుకున్నది దక్కనప్పుడు.. అనుకున్నది సాధించాలి అంటే కొన్ని తప్పులు చేయాలి అన్నప్పుడు కచ్చితంగా మనిషి ఆలోచన విధానం మారిపోతుంది. లక్ష్యానికి విధికి మధ్యలో నలిగిపోయినప్పుడు ఆ బాధను కచ్చితంగా ఆడియన్స్ కూడా ఫీలవగలుగుతారు.

ఆ పాయింట్ నే ఈ సిరీస్ లో బాగా చూపించారు. కొందరు టాలెంట్ ఉన్న నల్ల జాతీయులు యాక్టర్స్ గా మారినా కూడా అక్కడున్న వాళ్లు దానిని అంగీకరించరు. వారిని తెర వెనుకే ఉంచాలి అని చూస్తూ ఉంటార. ఇలా మంచి కాన్ ఫ్లిక్ట్ పాయింట్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ చూస్తే నిజంగానే హాలీవుడ్ లో ఇలా చేశారా? అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు. అక్కడ ఏమీ జరగకుండానే వీళ్లు సిరీస్ తీసేస్తారు అనుకోలేం కదా? అలా తీస్తే వాళ్లు ఊరుకోరు కదా? ఈ సిరీస్ పేరు కూడా ‘హాలీవుడ్’. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిని ఒంటరిగా చూస్తే బెటర్ గా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి