iDreamPost
android-app
ios-app

అతీత శక్తులతో యువతి ఒంటరి పోరాటం.. OTTలో చూడాల్సిందే..

OTT Suggestions: ఓటీటీలో ఉన్న చాలా సినిమాల్లో కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడదు అనేవి ఉంటాయి. ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా చేరుతుంది. మరి.. ఆ సినిమా ఏది? ఎందుకు అంత స్పెషలో చూడండి.

OTT Suggestions: ఓటీటీలో ఉన్న చాలా సినిమాల్లో కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడదు అనేవి ఉంటాయి. ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా చేరుతుంది. మరి.. ఆ సినిమా ఏది? ఎందుకు అంత స్పెషలో చూడండి.

అతీత శక్తులతో యువతి ఒంటరి పోరాటం.. OTTలో చూడాల్సిందే..

వీకెండ్ అయి పోయింది ఇంక ఇప్పుడు టైమ్ పాస్ కావాలి అంటే ఎవరికైనా ఉన్న ఒకే ఒక్క మార్గం సినిమా. వీలును బట్టి రోజుకు ఒకటో.. రెండ్రోజులకు ఒకటో ఓటీటీలో సినిమా చూడకపోతే ఏం తోచదు. అలాంటి వారికోసం అనే మేము ఓటీటీ సజీషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఓటీటీల్లో ఉండే మంచి సినిమాలను మీకోసం మా తరఫున సజీషన్ గా తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక మంచి థ్రిల్లింగ్ మూవీని తీసుకొచ్చాం. ఈ మూవీలో దాదాపుగా ఒక్కో సీన్ వణుకుపుట్టించేలా ఉంటుందని చెప్పాలి. మరి.. ఆ సినిమా ఏది? అసలు అంత వణుకు పుట్టించే అంశం ఏముంది? అనే విషయాలు చూద్దాం.

ఇప్పుడు చెప్పుకునే సినిమా పేరు ‘నో వన్ విల్ సేవ్ యూ’. ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. 2023, సెప్టెంబర్ 22న అమెరికాలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగని చూడటం మానేయకండి.. ఇందులో యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పెద్దగా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇది మొత్తం ఒక గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామంలో ఒక యువతి తన ప్రాణం కోసం పోరాడుతూ ఉంటుంది.

ఇది కాస్త మనకి కొత్త కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. కానీ, హాలీవుడ్ వాళ్లకి ఇలాంటివి కాస్త కామన్ గానే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు చూసే వారికి ఇది బాగా నచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని రాసింది, డైరెక్ట్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది ఒకాయనే. ఆయన మరెవరో కాదు బ్రియాన్ డఫీల్డ్. తాను తీసిన సినిమాలు అన్నీ దాదాపుగా ఇలాగే కొత్త తరహా కథలే. ఇది కూడా ఆ కోవకు చెందిందే. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ డ్రామా. టేకింగ్, విజువల్స్, బీజీఎం అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

కథ ఏంటంటే?:

కైట్లిన్ డెవర్ ఈ మూవీలీ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఆమె బ్రయిన్ క్యారెక్టర్ చేసింది. బ్రయిన్ ఒంటరిగా ఒక మారుమూల గ్రామానికి దూరంగా అడవిలో ఉంటుంది. తన ఫ్రెండ్, తన తల్లి చనిపోతారు. వారిని గుర్తు చేసుకుంటూ అక్కడే ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి నిద్రలోనుంచి సడెన్ లేస్తుంది. ఇంట్లో ఏదో అలికిడి అవుతుందని చూస్తుంది. తన ఇంట్లోకి ఒక ఏలియన్ వస్తుంది. తనని తాను రక్షించుకునే క్రమంలో బ్రయిన్ ఆ ఏలియన్ ని చంపేస్తుంది. ఆ తర్వాత తన లైఫ్ కాస్త భయంకరంగా మారుతుంది. ఆమె సహాయం కోసం గ్రామంలోకి వెళ్లగా.. అక్కడ అంతా విచిత్రంగా అనిపిస్తుంది. మనుషులు అందరూ ఎవరి అధీనంగలోనే ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఆ మనుషులకు ఏమైంది? వారి గ్రామానికి ఏలియన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆ ఏలియన్స్ నుంచి బ్రయిన్ తప్పించుకోగలిగిందా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే నో వన్ విల్ సేవ్ యూ సినిమా చూడాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet